పొత్తపి గ్రామం కడపజిల్లా నందలూరు కు 18కిలో మీటర్ల దూరంలో చెయ్యేరు నదికి అతి సమీపంలో ఉంది. తెలుగు చోళులు ఎక్కువ కాలం పొత్తపిని పొత్తపిసీమ, పొత్తపినాడు, పొత్తపిదేశం పేర్లతో పరిపాలించారు. వారిలో “రాజేంద్ర చోళుడు” (950-97శతక సం.) రారాజు. ఈయన పేరుతో మట్లి తిమ్మరాజు 1493శ. స. లో పొత్తపి దేశంలో రాజేంద్ర నగరం అనే బ్రాహ్మణులకు ఒక అగ్రహారం నిర్మించాడు.
పొత్తపి అబ్బికోట నిర్మాణం
మల్ల దేవమహారాజు, సోమదేవరాజు లు పొత్తపిదేశాన్ని పరిపాలించి అమరత్యం పొందారు. వీరు పొత్తపి గ్రామం లో విశాలమైన అబ్బికోట ను నిర్మించి పాలించే వారు. అయితే సమీప నెల్లూరు రాజులకు ఈ అబ్బికోట పై కన్నుపడి స. స. 1081ప్రమాద నామ సం. లో వీరిపై భీకర యుద్ధం జరిపి అమరులను చేసారు. ఆ తర్వాత పొత్తపి లోని అబ్బికోట పైపడి గోడలను కూల్చి, కాల్చి, పడగొట్టి నేలమట్టం గావించారు. దాంతో ఆనతికాలం లోనే ఈ అబ్బికోట చరిత్ర అంతమైంది.
పొత్తపి దేశం అనగా పూర్వ రాజంపేట తాలూకు లోని అన్ని భాగాలు.సిద్దవటం సీమ, వల్లూరు, కమలాపురం, గండికోట, కలకడ, చంద్రగిరి, కాళహస్తి, తిరుపతి, నారాయణ వనం, ఉదయగిరి రాజ్య సరిహద్దులు గల విశాలప్రాంతాలను కలిపి పొత్తపినాడు గా అనేవారు. ఇట్టి సువిశాలమైన ప్రాంతానికి రాజధాని పొత్తపి. ఈ పొత్తపినాడు దేశాన్ని పరిపాలించిన రాజులు అనేక ప్రాంతాల్లో నిర్మించిన గండికోట, సిద్దవటం కోట, చంద్రగిరికోట, గడికోట, మీడిపెంట్ల కోట(వేముల మండలం )ఎర్రగుంట్ల కోట చాలా ప్రసిద్ధి పొందాయి.
పొత్తపి గ్రామం లో అబ్బికోట (ప్రస్తుతంఎలాంటి ఆనవాళ్లు లేవు. కోటలకు అనుబంధం గా వుండే అగర్తల ఉంది )ఉంది.
ఇంకా ఎప్పిరాళ్లకోట, ఓగూరు కోట, చోళపురంకోట, మద్దిలేటికోట, సోమరాజుకోట, లింగాలకోట, సిద్దిరాజుకోట లు ఉన్నాయి. ఇవి చాలా మటుకు శిథిలమై ఆక్రమణలకు గురైనాయి.
