ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, బొంబాయి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగాన్ని స్థాపించిన వారు, ఒంగోలు సి.ఎస్.ఆర్.శర్మ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజకీయశాస్త్రంలో రీడరు,
అనేక గ్రంథాలను రచించిన రచయిత. ప్రతిభావంతులు.
రాయలసీమ ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. ప్రతాపగిరి రామమూర్తి.

కడప జిల్లా నందలూరులో 1900 ఆగష్టు 25వ తేదీన ప్రతాపగిరి రామమూర్తి. జన్మించాడు. తండ్రి గోపాలకృష్ణయ్య తల్లి భ్రమరాంబ.తండ్రి గోపాలకృష్ణయ్య
ప్రముఖ న్యాయవాది. జాతీయ భావాలు కలవాడు.

మహాత్మాగాంధీ పిలుపునందుకొని 1920లో వేలాదిమంది విద్యార్థులు తమ కళాశాల విద్యకు స్వస్తి చెప్పారు. అలాంటి వారిలో కడప జిల్లా నందలూరుకు చెందిన ప్రతాపగిరి రామమూర్తి ఒకడు.

1920లో సహాయ నిరాకరణోద్యమంలో గాంధీ పిలుపు మేరకు పాల్గొన్నారు.
సహాయ నిరాకరణోద్యమం, భారత స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం. బ్రిటిషు ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం. 1920 సెప్టెంబరు 4 న మొదలై 1922 ఫిబ్రవరిలో ముగిసింది.

1919 మార్చి 21 నాటి రౌలట్ చట్టానికి, 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోతకూ నిరసనగా సంపూర్ణ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిషు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యాలని పిలుపునివ్వడంతో ఉద్యమానికి బీజం పడింది.

1920లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గోన్న
రామమూర్తి కి ఏడాదిపాటు శిక్ష విధించారు. వేలూరు, కడలూరు జైళ్లలో గడిపాడు. వేలూరిలో జైల్లో ఈయనతో పాటు ఉన్న ఉన్నవ లక్ష్మీనారాయణ కి ‘ మాలపల్లి ’ నవల రాయడానికి సహకారాన్ని అందించారు. కడలూరు జైలులో రాజాజీ ఇతని సహచర ఖైదీగా వుండేవాడు.

ప్రతాపగిరి రామమూర్తి అక్క
కమలాదేవి కూడా స్వతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గోనెవారు. అక్క స్పూర్తితో ఈయన చదువు మధ్యలో ఆపి ఉద్యమాల్లో పాల్గొన్నారు.

అక్కగారి ప్రభావంతో రామమూర్తి స్వతంత్ర్యం కోసం కాంగ్రెసులో చురుకుగా పనిచేశాడు. రాష్ట్ర కాంగ్రెసు ఆదేశానుసారం “పిల్లుట్ల హనుమంతరావు”తో కలసి కడప జిల్లాలో తీవ్రంగా కాంగ్రెసు ప్రచారం చేసి కల్లుసారాయి దుకాణాలు మూతపడేటట్లు,గ్రామోద్యోగులు రాజీనామా చేసేటట్లు చేశాడు.

ఇంటిల్లిపాది ఖద్దరు దుస్తులు ధరించేవారు. ఇతని అక్క “దేశసేవిక” వేదాంతం కమలాదేవి భర్త కాకినాడ నివాసి కావడంతో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని పలుమార్లు జైలుకెళ్లింది.

ఈయన 16ఏళ్ల వయస్సు లోనే వివాహం చేసుకొన్నారు.
భార్య కూడ మంచి దేశభక్తురాలు.

1916లో శాంతాబాయి వివాహం చేసుకొన్నారు.ఈమె
చిన్న వయసులోనే రామమూర్తితో పాటు ఉద్యమంలో పాల్గొంటూ వచ్చింది.

1921లో తిలక్ స్వరాజ్య నిధి కి గాంధీజీ విరాళాలకు విజ్ఞప్తి చేయగా రామమూర్తి భార్య శాంతాబాయి తన ఒంటిమీద నగలు మంగళసూత్రంతో సహా మహాత్మునికి సమర్పించింది.

తిరిగి 1933లో హరిజన్ నిధి కి గాంధీజీ రాజమండ్రి రాగా మరోసారిశాంతాబాయి తన ఒంటిమీది మిగిలివున్న ఆభరణాలను మహాత్మునికి అర్పించింది.

ప్రతాపగిరి రామమూర్తి భార్య
శాంతాబాయి జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. 1923 కాంగ్రెసు మహాసభలలో పాల్గొన్నారు.

1926లో మహిళా సభలో శాంతాబాయి తన ఆడబిడ్డ
వేదాంతం కమలాదేవిగారి వెన్నంటి నిలిచారు. 1941లో అనంతపురం జిల్లా మడకశిర లో సత్యాగ్రహం చేయగా
3 నెలల శిక్ష విధించారు.
వేలూరు జైలు కు పంపారు. జైలులో అనారోగ్యంపాలైన శాంతాబాయి 1947 జనవరి 10న బొంబాయిలోఒక ఆస్పత్రి లో మరణించారు.

1939 మే నెల 5 నుంచి నెలరోజులపాటు హిందూపురం లోని మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాల లో ‘ ఆర్ధిక, రాజకీయ వేసవి పాఠశాల నిర్వహించినారు. ప్రతాపగిరి రామమూర్తి, ఆచార్య రంగా, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, శనివారపు సుబ్బారావు, బెజవాడ గోపాలరెడ్డి, కాళేశ్వరరావు, పి.సి.జోషి, కార్లేకర్, పుచ్చలపల్లి సుందరయ్య, పి.రామమూర్తి, తరిమెల నాగిరెడ్డి ఉపన్యాసకులుగా పాల్గొన్నారు. వర్తమాన భారత దేశరాకీయ, ఆర్థిక పరిస్థితులతోబాటు భౌతికవాదం, సోషలిజం, సామ్రాజ్య వాదం, రష్యా విప్లవం, వివిధ వర్గాలు – వాటి మధ్య సంబంధాలు, ఫాసిజం. టర్కీస్వాతంత్ర్యోద్యమ పోరాటం – ఈ అంశాలను కూడా బోధించారు.

ప్రతాపగిరి రామమూర్తి 1942 లో బొంబాయి చేరి ఒక సంవత్సరం జౌళి మిల్లులో పనిచేసి డబ్బు సంపాదించి మరుసటి సంవత్సరం విల్సన్ కాలేజీలో చదివి బీఏ, ఎం.ఏ డిగ్రీలు సంపాదించాడు. విల్సన్ కాలేజీలోనే అధ్యాపకులుగా రామమూర్తి చేరారు.

ఈయన మేధస్సును గుర్తించి ‘డాక్టరేట్’ లేకపోయినా బొంబాయి విశ్వవిద్యాలయం లో ఆచార్యునిగా నియమించింది.
బొంబాయి విశ్వవిద్యాలయం లో రాజనీతి శాస్త్ర విభాగాన్ని ప్రారంభించిన ఖ్యాతి వీరిదే.

ఆయన రాసిన “ద ప్రాబ్లం ఆఫ్ ఇండియన్ పాలిటీ”
(The Problem of Indian Polity)
ది ఫిలాసిఫకల్ అప్రోచ్ టు పాలిటిక్స్ ,
(The Philosophical Approach To Politics)
ది గ్రోత్ ఆఫ్ సివిల్ ఇండియా
(The Growth of Civil India) గ్రంథాలురచించారు. వీటిని గొప్ప గొప్ప పండితులు ప్రమాణ గ్రంథంగా స్వీకరించారు.

రామమూర్తి, ఆయన శిష్యులు రచించిన పరిశోధనా గ్రంథాలయిన ‘‘గోల్కొండ చరిత్ర’’ గాంధీజీ దృక్పథం లాంటి గ్రంథాలకు మార్గనిర్దేశనం చేశారు.

బొంబాయి ఆంధ్రమహాసభ స్థాపకులలో వీరొకరు. కమ్యూనిస్టు నేత డాంగే, రణదివే, సోషలిస్టు నేత అశోక్‌మెహతాలు రామమూర్తికి సన్నిహితులు.

1952-54లో ఒంగోలులో శర్మ కాలేజీకి తొలి ప్రిన్స్‌పాల్‌గా రామమూర్తి బాధ్యతలు చేపట్టారు.కాలేజీని సుస్థిర పరిచారు.

1954లో ఆంధ్ర యూనివర్శిటీ ఆహ్వానం మేరకు ‘రీడరు’గా పనిచేసారు. పొలిటికల్‌ సైన్స్‌ బోధించేవారు. ఆయన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించడం కారణంగా విద్యార్థుల్లో చెరగని ముద్ర వేశారు.

1955 అక్టోబర్ 7న మరణించారు. వీరికి ఒక కొడుకు, కూతురు. వీరి పేర్లు రవీంద్రనాథ్,ప్రమీల.

ప్రతాపగిరి రామమూర్తి, శాంతాబాయి దంపతులు జీవితకాలం దేశసేవలో గడిపిన ధన్య జీవనులు.

దేశభక్తులు, సంఘసంస్కర్త, మహావక్త, గొప్ప రచయిత అయిన ఆచార్య ప్రతాపగిరి రామమూర్తిగారి జీవితం నుండి నేటితరం నేర్చుకోవాల్సింది ఎంతో వుంది.

ప్రతాపగిరి రామమూర్తి గురించి జీవిత చరిత్రలు వ్రాయడంలో సిద్ధహస్తులైన రావినూతల శ్రీరాములు
ఓ పుస్తకం రచించారు. పుస్తకం పేరు ప్రతిభాశాలి ఆచార్య ప్రతాపగిరి రామమూర్తి

చైతన్య గ్రంథమాల, సికింద్రాబాదు వారు ప్రచురించారు.

ప్రతాపగిరి రామమూర్తి గురించి పుస్తకంలో 24 అధ్యాయాలలో వివరించారు. రామమూర్తి గారి తల్లి ప్రతాపగిరి భ్రమరాంబ గారికి ఈ పుస్తకం అంకితం చేయబడింది.

రచన :-చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s