
సినిమాల్లో నటించాలని ఆరాటపడి చాలా డబ్బు ఖర్చు చేసి తన కోరిక తీర్చుకొన్నాడు. మంచి నటుడు గా గుర్తింపు పొందినప్పటికి ఎక్కువ కాలం సినిమా రంగంలో ఉండలేక పొయారు.
వెల్లాల ఉమామహేశ్వరరావు తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది, రంగస్థల నటుడు, రచయిత, నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. “లేపాక్షి” అనే పేరుతో డాక్యుమెంటరీ నిర్మించాడు.
వెల్లాల ఉమామహేశ్వరరావు
1912, ఆగష్టు 30 న చిత్తూరు జిల్లా, పుంగనూరుగ్రామంలో జన్మించారు.
తండ్రి శ్రీకంఠయ్య తల్లి
కృపాలక్ష్మమ్మ .
వెల్లాల ఉమామహేశ్వరరావు 4వ తరగతి వరకు చిత్తూరు లో చదివారు.తరువాత ఉన్నత పాఠశాల విద్య కడపలో చదివారు.
ఇంటర్మీడియెట్ మద్రాసులో చదివాడు. బి.ఎ.అనంతపురం దత్తమండల కళాశాలలో చదివాడు. మద్రాసులో లా చదివి అక్కడే న్యాయవాదిగా కొంతకాలం పనిచేశాడు.
1940 లో చలనచిత్ర పరిశ్రమలో హీరో గా రంగప్రవేశం చేశారు.
మాలపిల్ల, రైతుబిడ్డ వంటి సంచలన చిత్రాలు నిర్మించిన గూడవల్లి రామబ్రహ్మం, ఈ రెండు చిత్రాల వల్ల ఏర్పడిన ఇబ్బందుల కారణంగా, ‘రైతుబిడ్డ’ పై జమీందార్లు అలిగి ప్రింట్లు తగలబెట్టడం, నిషేధింప చేయడం వంటి అంశాలతో మనస్థాపం చెంది సినీ రంగానికి కొంతకాలందూరమైయ్యారు.
ఉమామహేశ్వరరావు తనకు నటించాలనే కోరిక వల్ల తన స్వంత డబ్బు అందించి ఇందిరా ఫిలింస్ అనే సంస్థకు దర్శకత్వం చేయడానికి రామబ్రహం ను ఒప్పించి ‘ ఇల్లాలు ‘ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో న్యాయవాది గా ఉన్న ఉమామహేశ్వరరావు ని హీరోగా, సాలూరి రాజేశ్వరరావు ని సంగీత దర్శకుడిగా పరిచయం చేసారు. కాంచనమాల హీరోయిన్. రావు బాల సరస్వతీదేవి ఇందులో నటించి పాటలు పాడటమే కాకుండా కాంచనమాలను రాజేశ్వరరావు బాణికి అనుగుణంగా పాడేలా చేసారు. ఈసినిమా మంచి హిట్ అయ్యింది.

1943 లో రెండో సినిమా భాగ్యలక్ష్మి .1943లో వెలువడిన ఈ తెలుగు సినిమా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం ఇది 100వ తెలుగు టాకీ సినిమా. చిత్తూరు నాగయ్య నిర్మాతగా ఇది తొలి సినిమా
పి.పుల్లయ్య దర్శకత్వం వహించారు.శ్రీ రేణుక ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో
చిత్తూరు నాగయ్య ,
మాలతి ,దొరస్వామి,
టి.సూర్యకుమారి,గిరి,
ఉమామహేశ్వరరావు నటించారు.

1943 లో మూడవ సినిమా గా పంతులమ్మ వచ్చింది. పంతులమ్మ సినిమా సారధీ పిక్చర్స్ పతాకం లో గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో తయారైంది.
దీనిలో లక్ష్మీరాజ్యం, ఉమామహేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి, డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి, డి.హేమలత మొదలైన వారు నటించారు
ఒక బాలిక పాత్రలో బాలగాయని పి.జి.కృష్ణవేణి (జిక్కి)ని రామబ్రహ్మం పరిచయం చేశారు. “ఈ తీరని నిన్నెరిగి పలుకగా – నా తరమా – జగదేక కారణా” అనే పాటను జిక్కీ పాడింది.
ఈ పాటను సముద్రాల రాఘవాచార్య రచించారు. సముద్రాల వారే ఈ చిత్రానికి సంభాషణలు కూడా వ్రాసారు. స్క్రీన్ ప్లే రచనలో ఇంటూరి వెంకటేశ్వరరావు సహకారాన్ని అందించారు.
అనంతరం చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో గా పేరు తెచ్చుకున్నారు.
అనంతపురంలో డిగ్రీ చదివేటప్పుడు 1932 లో మఠం వాసుదేవమూర్తి, పాళ్ళూరు సుబ్బణాచార్యులుతో కలిసి ‘కవికుమారసమితి’గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు , తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించాడు.
వి.ఉమా మహేశ్వర్, పుట్టపర్తి నారాయణచార్యులు బాల్య
స్నేహితులు. వీరిద్దరూ సాహిత్యం పై తరచూ చర్చించేవారు. వి.ఉమా మహేశ్వర్ 1960వ దశకంలో
షేక్స్ పియర్ డ్రామాలను చాలా వాటిని
తెలుగులోకి అనువదించారు.
మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ మహాత్ముని అంతరంగము అనే రచన చేశాడు. గృహలక్ష్మీ మాసపత్రిక కు రచనలు చెసేవారు.

ఈ పత్రిక తొలి సంచిక మార్చి 1928లో వెలువడింది. గరిమెళ్ల సత్యనారాయణ ఈ పత్రికకు 1930లలో కొంతకాలం సంపాదకునిగా పనిచేశారు.
ఈ పత్రిక 1942లో అనివార్యమైన యుద్ధ పరిస్థితులలో తాత్కాలికంగా నిలిచిపోయి 1946లో తిరిగి ప్రారంభమైంది.
ఈ పత్రికలో ప్రతిసంచికలోనూ సి.ఎన్.వెంకటరావు మొదలైన చిత్రకారుల తైలవర్ణ చిత్రాలు ప్రచురించేవారు. కనుపర్తి వరలక్ష్మమ్మ, వావిలికొలను సుబ్బారావు, కల్లూరు అహోబలరావు, విశ్వనాథ కవిరాజు, గంటి కృష్ణవేణమ్మ, వెల్లాల ఉమామహేశ్వరరావు, గుమ్మడిదల దుర్గాబాయమ్మ, అనుముల వెంకటశేషకవి, శివరాజు వెంకట సుబ్బారావు, కవికొండల వెంకటరావు, అంగర వెంకటకృష్ణారావు మొదలైనవారు రచనలు చేశారు.
