అనంతపురం జిల్లా కంబదూరు మండలం లోని రాళ్ళపల్లి గ్రామం లో  అలివేలుమంగమ్మ ,క్రిష్ణమాచార్యులకు జనవరి 23,1893న జన్మించిన రాళ్ళపల్లి  అనంతకృష్ణ శర్మ సంగీత సాహిత్యాలలో ప్రసిద్దుడు . 

తెలుగు సాహిత్య విమర్శ కులలో పేరెన్నిక గన్నవాడు .వెమన పై సాదికారిక గ్రంధాన్ని రచించాడు . అన్నమా చార్య కృతులను స్వరపరచి తెలుగు వారికి అందించాడు . అటు కన్నడ ఇటు తెలుగు వారి హృదయాలను చూరగొన్న గొప్ప సంగీత సాహి త్య విద్వాంసుడు . కర్నాట సంగీతం లో స్రష్ట . రాయలసీమ లో ప్రభవించిన రత్నం రాళ్ళపల్లి .

            తల్లి దగ్గర సంగీతాన్ని చిన్నతనం నుండే నేర్చు కున్నాడు . తండ్రి వద్ద సంస్క్రతాంద్ర భాషలలో ప్రావీణ్యత సంపాదించాడు . 19 05లో రాళ్ళపల్లి ని విడిచి పై చదువు ల కోసం మైసూరుకు వెళ్ళాడు . అక్కడ బ్రహ్మ తంత్ర   పరకాల మఠం లో ఉండేవాడు . రాళ్ళపల్లి కున్న నిశితమైన కుశా గ్రబుద్ది ,అణుకువ, ఏకసంద్రా గ్రాహ శక్తి ని  చూసి మఠాదిపతి శర్మ ను మఠం లో చేర్చుకున్నాడు .  రాళ్ళపల్లి  ఆ మఠాదిపతి బ్రహ్మ తంత్ర స్వామి 

దగ్గర శిష్యరికం చేశాడు . మైసూరులోని చామరాజనగర్ సంస్కృత పండితుడు రామశాస్త్రి దగ్గరకూడా శిష్యరికం చేశాడు. రాళ్ళపల్లి లోని తెలుగు భాషా కౌశలాన్ని గుర్తించిన వ్యక్తి  కట్టమంచి రామలింగారెడ్డి. 1910 లో మైసూరు మహారాజా కాలేజీ లో కట్టమంచి రామలింగారెడ్డి ఉపన్యాసకునిగా పని చేస్తున్నారు . అక్కడ రాళ్ళపల్లి లోని తెలుగు భాషా కోవిదున్ని గుర్తించిన కట్టమంచి రాళ్ళపల్లి ని ప్రోత్సహించాడు . దాంతో రాళ్ళపల్లి తారాదేవి,మీరాబాయి లపై  రచనలను చేశాడు . అప్పటికి అతని వయాస్సు 18-19 సంవత్సరములు మాత్రమె . వారి ఆహ్వానం పై 1912లో మొట్టమొదటి సారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించాడు . 

ఆ విధంగా రాళ్ళపల్లి కర్నాటక లో తెలుగు సాహిత్యం పై అధ్యనం ప్రారంభమైంది .  రాళ్ళపల్లి వారి విశిష్ట రచన వేమనపై రాసిన విమర్శా గ్రంధం  1928 లో వేమనపై పరిశోధన చేసి ఏడు వ్యాసాలు  రాసారు .వాటిని చూచిన చిలుకూరి నారాయణ రావు చాలా మెచ్చు కొన్నారు  ఆంద్ర వికాస పరిషద్ వారు ఆ వ్యాసాలను ఒక పుస్తకంగా తీసుకొచ్చారు 

                       1935లో నాటకోపన్యాసములు అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించారు . దీనిలో నాటక రంగంలోని వివిధ ప్రక్రియలలో వున్న సాధక భాధక లను తెలియజేసారు . ముఖ్యంగా స్త్రీ పాత్రలను పురుషులు వేసే విధానం  , పాటలు పాడటం  , విశాదాంతాన్ని రక్తి కట్టించడం  , పాత్స్యా శ్య ధోరణులను అనుకరించటం  మొదలైన విషయాలను ఇందులో చర్చించారు .ఆయన ప్రసిద్ద గ్రంధం సారస్వత లోకము . ఇందులో తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యం లో నిగమ శర్మ అక్క పాత్రపై వ్యాసం వుంది . తిక్కన ఉత్తర రామ చరితం లోని సీత పాత్ర పై తిక్కన తీర్చిన సీతమ్మ అనే వ్యాసాన్ని,రాయలనాటి రసికత వ్యాసాన్ని ఇందులో రాసారు . ఈ వ్యాస సంకలనాన్ని చాలా విశ్వవిద్యాలయాల్లో  చాలా కాలం పాట్యగ్రన్ధంగా వుండేది . ఉన్నత పాటశాలల్లో కూడా వ్యాసాలను పాఠ్యాంసాలుగా తీసుకొన్నారు 

                       ఆయనకు సంస్కృత భాషలో ప్రావీణ్యం వుండటం చేత శాలివాహన గాథ సప్తశతిలోని  395 శ్లోకాలను ప్రాకృతం లోనుంచి తెలుగు లోకి అనువదించి 1931 లో ప్రచురించారు. 1964లో వెబర్ అనే జర్మన్ పండితుడు మరికొన్ని తాను  చేసిన అనువాదాలను చేర్చి శాలివాహన గాథా సప్తసతి సరాలు పుస్తకాన్ని  అభివృద్ది చేశారు. కన్నడ సంగీత సాహిత్యం లో  ఆయన రాసిన’ గానకళె ‘,’సాహిత్య మత్తు జీవనకలే’ విశిష్ట రచనలు. వీటిని తెలుగు కన్నడ భాషలలో రచించారు. సాహిత్యం లోనే కాక  సంగీతం లోకూడా  ఆయన ప్రతిభ అమోఘం . ఆయన పాటలను పాదగలడు . రాయగలరు . రాసిన వాటికి స్వరకల్పన చేసి సంగీతాన్ని సమకూర్చగలరు . తాళ్ళ పాక పాటలపై   లక్షణాల్ని రెండు గ్రంధాలుగా వెలువరించారు. 

                       సంగీత కళానిధి  రాళ్ళ పల్లి   తిరుమల తిరుపతి దేవస్తానం ఆహ్వానం మేరకు తాళపాక  కీర్తనలు పరిశీలించి  కొన్నింటిని స్వరకల్పన చెశార రేడియోకు ఆకాశవాణి  అని పేరు పెట్టింది ఆయనే . మైసూరులో జరిగిన సంగీత సమ్మేళనంలో గానకళా  సింధు  బిరుదును నిచ్చారు .  బెంగుళూరు గాయక సమాజం సంగీత  కళారత్న బిరుదునిచ్చారు. కేంద్ర సంగీత  నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ నిచ్చి సత్కరించింది . శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డిలిట్ పట్టాలతో సత్కరించింది . తెలుగు కన్నడ సంస్కృత భాషల్లో కోవిదుడైన రాళ్లపల్లి  1979 మార్చి 11న బెంగుళూరులో మరణించారు. ఆయన కంచు విగ్రహాన్ని 2008లో ఆగస్టు 23న తిరుపతి లోని పద్మావతి విశ్వవిద్యాలయం దగ్గర శ్వేత భవనం ముందర  ప్రతిష్టించారు .

                  రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ – కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. ఈ పాటను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇక్కడ సమంజసము.

పెనుకొండ – కొండ పాట

చనిన నాళుల – తెనుగు కత్తుల

సాన పెట్టిన బండ – ఈ

పెనుకొండ – కొండ

రంధ్రముల ప్రహరించు శత్రుల

రక్తధారల ద్రావి త్రేచిన

ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల

కఱితి నీలపు దండ – ఈ

పెనుకొండ – కొండ

వెఱవు లెఱుగని – బిరుదు నడకల

విజయనగరపు రాజు కొడుకులు

పొరలబోయగ కరుడు గట్టిన

పచ్చి నెత్తురు కండ – ఈ

పెనుకొండ – కొండ

తిరుమలేంద్రుని – కీర్తి తేనెలు

బెరసి దాచిన కాపుకవనపు

నిరుపమ ద్రాక్షారసంబులు

నిండి తొలకెడి కుండ – ఈ

పెనుకొండ – కొండ    —–  పిళ్లా కుమారస్వామి

1 comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s