కుందేరు – కుందూ ను సంస్కృతంలో కుముద్వతి అంటారు. కుముద్వతి అంటే తెల్ల కలువ తీగ – సీతారాముల కుమారుడు కుశుడి భార్య పేరు కూడా కుముద్వతి. కర్నూలు జిల్లాలో సున్నపు నేలల మీదుగా ప్రవహించటం వల్ల తెల్లగా ఉన్న నీటి వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతమే రేనాటి సీమ.

  కుందేరు కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ కడపజిల్లా , కమలాపురం
 

సమీపంలో పెన్నా నదిలో కలుస్తుంది. దీనిని కుందూ, కుముద్వతి అని పేర్లతో కూడా వ్యవహరిస్తుంటారు.ఈ నదీతీరాన ఉన్న పట్టణాలలో నంద్యాల ముఖ్యమైంది, అతి పెద్దది.కర్నూలుజిల్లాలోని ఓర్వకల్లుమిడుతూరుగడివేములనంద్యాలగోస్పాడుకోయిలకుంట్లదొర్నిపాడుచాగలమర్రివైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు మండలాలు కుందేరు నది నీటి పరీవాహక పరిధిలో ఉన్నాయి.

నంద్యాల-కర్నూలు మార్గంలో కుందూనది – 2009 అక్టోబరు మాసంలో వరదలు వచ్చినప్పుడు తీయబడిన చిత్రము

కుందేరులో నీళ్లు పశ్చిమాన మద్దిలేరు, జుర్రేరు నుండి తూర్పున కాళి, వక్కలేరు నుండి చేరతాయి. కుందేరు, మద్దిలేరు నిండా నీటితో ప్రవహించినప్పుడు వాటి మధ్యన ఉన్న జలకనూరు వంటి గ్రామాలు నీటితో నిండిపోతాయి. జుర్రేరు బనగానపల్లె ప్రాంతం నుండి ప్రవహించి కుందేరులో చేరుతుంది. కుందేరు నదీ అడుగున ఎక్కువ భాగం  రాతిమయంతో ఉంటుంది.ఇక్కడ సున్నపు రాళ్లను త్రవ్వి తీస్తారు.నది అడుగు శిలల  పొరలతో ఉంటాన నీరు భూమిలోకి ఇంకక పోవడం ఈ నది విశేషం. దీనివల్ల నది వెంబడి ఉన్న బావుల్లో నీరు తాగే యోగ్యంగా లేదు.నంద్యాల వద్ద కుందేరు  కర్నూలుకంభం రహదారి దాటే చోట 1864లో ఒక వంతెన  నిర్మించారు.

ఈ కుందూనది రాయలసీమలో పుట్టి రాయలసీమలోనే ముగుస్తున్న నది. ప్రతి ఏటా సాదారణ సందర్బాలలో 15-20 TMC లు, అదే పెద్ద వరదలు వచ్చినపుడు 60-70 TMC ల నీటిని తీసుకు వస్తున్న నది . కాని ఆ నీరు  కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రజలకు దక్కడం లేదు. కారణం కుందూ నీటిని సీమ ప్రజలకు అందించడానికి తగిన రిజర్వాయర్ లు, చెక్ డ్యామ్ లు నిర్మించక పోవడమే. నిత్యం త్రాగు నీటికి సైతం కట, కట లాడుతున్న కడప ప్రజలకు జిల్లాలోని ఆదినిమ్మాయన పల్లి బ్యారేజి అవసరం ఉంది. అందువల్ల జగన్ ప్రభుత్వం పుష్పగిరి ఆలయం సమీపంలో ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదిస్తోంది. ఇందుకు అవసరమైన డీపీఆర్  తయారు చేయడానికి రూ. 85. 50 లక్షలతో తొలి దశ పాలనామోదం ఇచ్చారు.

ఇప్పటికే  అనుమతులు ఉన్న కర్నూలు జిల్లా జొలద రాశి, రాజోలి రిజర్వాయర్ లను పూర్తి చేయాలి.  ఆ వైపుగా జగన్ ప్రభుత్వం ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామం.

కుందూనది ప్రాధాన్యత…


రాయలసీమ ప్రాంతం గుండా క్రిష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయి. సగటున ప్రతి ఏటా 1100 TMC ల నీటిని రాయలసీమ ప్రాంతం నుంచే తీసుకెళతాయి. అందులో రాయలసీమకు కేటాయించింది కేవలం 133.7 TMC లే. అందులోను తగిన ఏర్పాట్లు లేకపోవడం, శ్రీశైలంలో 854 అడుగులు నీటి మట్టం నిర్వహించక పోవడం వలన ఆ కొద్ది పాటి నీటిని కూడా వాడుకోలేని దుస్దితి సీమ ప్రజలది. ఉపనది అయిన కుందూ ప్రతి ఏటా అపారమైన నీటిని తీసుకు వస్తుంది.

ఈ నది సీమలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని ఉప్పలపాడు దగ్గర పుడుతుంది. అక్కడి నుంచి సింహ భాగం కర్నూలు జిల్లాలో ప్రవహించి ఖాజిపేట దగ్గర కడప జిల్లాలో పెన్నా లో కలిసి పోతుంది. ఏ సహజ న్యాయ సూత్రల ప్రకారం అయిన ఆ నీటిని కచ్చితంగా కర్నూలు, కడప మరియు మిగిలిన రాయలసీమ ప్రజలు వాడుకోవాలి. ప్రధాన నదులైన క్రిష్ణా, తుంగభద్ర నీటిని సైతం వాడుకోలేక పోతున్న ఈ ప్రాంత ప్రజలకు కుందూనది నీటిని పూర్తిగా అందించడం ప్రభుత్వాల కనీస బాద్యత.
కుందూనది ఉదృతంగా ప్రవహించేటప్పుడు నంద్యాల దగ్గర రాకపోకలు సైతం కష్టం.అంతే కాదు నంద్యాల పట్టణానికి రక్షణ కోసం  గోడ నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అంటే కుందూనది ఏస్దాయిలో నీటిని తీసుకు వస్తుందో ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. 
కుందూ నీటిని పూర్తిగా రాయలసీమ ప్రజలు వాడుకోవాలంటే ఇప్పటికే నిర్మించిన అలగనూరు తో బాటు జొలద రాశి, రాజోలు, ఆదినిమ్మాయన పల్లి దగ్గర బ్యారేజీలను నిర్మించాలి. ఆది నిమ్మాయన పల్లి దగ్గర అయితే ఆంగ్లేయుల కాలంలోనే చిన్నపాటి వంతెన ఏర్పాటు అయింది. 

దాన్ని బ్యారేజీగా మార్చడం చాల స్వల్ప పని దాదాపు 150 కోట్లతో పని పూర్తి అవుతుంది. 

Kundu at Adinimmayapalli


కడప జిల్లాలో పెన్నాలో కలిసిన కుందూ నీరు నేరుగా సోమశిలకు చేరుతుంది. దానికి ఎటువంటి నీటి కేటాయింపు లేకపోయినా కుందూనది నీరు చేరుతోంది.

Source:

Wikipedia and Makireddy
Purushothamareddy facebook

Pillaa kumaraswaamy,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s