Bukkarayasamudram


          విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహర రాయలు,బుక్కరాయలలో బుక్కరాయలు అనంత పురానికి దగ్గరలో ఒక చెరువు త్రవ్వించినారు.ఆయన పేరు మీద  బుక్కరాయ సముద్రం అనే వూరు ఏర్పడింది. ఇప్పుడది అనంతపురం జిల్లాలో ఒక మండలకేంద్రం.

జనాభా

2011 జనభా గణాంకాల లెక్కల ప్రకారం మండల జనాభా  22000. మగవారు 11034, ఆడవారు 10966. షెడ్యూల్డ్ కులాలు 2372, షెడ్యూల్డ్ తెగలు 554.లింగ నిష్పత్తి 994/1100

వైద్య సదుపాయాలు

ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.ఇందులో 3 డాక్టర్లు , 9 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది.ఇందులో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

ఒక పశు వైద్యశాల ఉంది. దీనిలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల బుక్కరాయసముద్రం నుండి 5 కి.మీ. దూరంలో ఉన్నాయి.

కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

రెవిన్యూ గ్రామాలు

పొడరాళ్ల,జంతులూరు,చెదుళ్ల,కొర్రపాడు,
చెన్నంపల్లి,బోడిగానిదొడ్డి,చెన్నరాయునిపల్లె,
సిద్దంపేట,గోవిందపల్లి,బుక్కరాయసముద్రం,
రెడ్డిపల్లి,సిద్దరాంపురం,దండువారిపల్లి,
కె.కె.అగ్రహారం.

కేంద్ర విశ్వవిద్యాలయం

బుక్కరాయ సముద్రం మండలంలోని జంతులూరు గ్రామంలో 491.23 ఎకరాల్లోరూ.902.07 కోట్లతో ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వ విద్యాలయం ను నిర్మించనున్నారు

వ్యవసాయ పరిశోధనా క్షేత్రం

Agriculture Reasearch Centre

మండల కేంద్రంలో ఒక వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఉంది.

పెద్దమ్మ దేవాలయం

Peddamma temple, Bukkarayasamudram

మండలంలో పెద్దమ్మ గుడి ఉంది.ఇక్కడ బోనాల జాతర జరుపుకుంటారు.

Pillaa kumaraswaamy,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s