నాలుగు రోజులు ఉండి పోవడానికి ఏ కులమైతేనేమి
రంగస్థలంపై వేషం వేసుకొని
నటించినట్టు
ఈ భువిపై నటించడానికి
ఏ మతమైతేనేమి
తల్లి దండ్రులు ఎవరైతేనేమి
ఏ వూరైతేనేమి? ఏగేరైతేనేమి?
ఎవరి ఇళ్ళైతేనేమి ఏబంధువైతే నేమి/ఏ కష్టం చేస్తేనేమి/ఎవరికి
ఏ నష్టం కలిగించని ఏ పనైతేనేమి/కుటుంబానికి కావలసిన సొమ్ము చాలదేమి?
కూడు గూడు బట్ట ఉంటే చాలదా?
మూడు పూటలు తింటే చాలదా ఏమి?
అప్పు లేకుండా బ్రతికితే
చాలదా ఏమి?
కట్టు బాట్లు తెంపుకొని
అన్యాయార్జన వెనకేసుకొని
అక్రమార్జన పెంచేసుకొని
పది మంది కూడును లాగేసుకొని
నీ ఒక్కడి పొట్ట నింపుకుంటే
నీ కోచ్చే ఫలమేమి?
తరతరాలు కూర్చోని తిన్నా
తరగని ఆస్తులు సంపాదించిన
నీ వెంట ఒక్క రూపీ రాదుకదా?
ఎత్తు పల్లాలు సమమయితే
ధనిక పేద ఏకమైతే
సమానత్వంతో తేజరిల్లితే
ఆకలి చావులు/అప్పుల ఆత్మహత్యలు మచ్చుకైనావుండవుగా/

అందరూ సంతోషంగా జీవిస్తారుగా
అందరూ ఆనందంగా
అనుభవిస్తారుగా
ఓ కొత్త ప్రపంచం ఆవిష్కరించ
వచ్చుగా/ప్రజలంతా చీకుచింతా
లేకుండ జీవించోచ్చుగా
ఇలా జరిగితేనే గదా అభ్యుదయం
లిఖించవచ్చుగదా సరి క్రొత్త
అధ్యాయం
అపుడు ప్రభవించు నూతనోదయం!!

22.11.2020

Kavita Venkateswarlu
Rtd. junior Accounts Officer. APSPDCL,Kurnool
Cell..8309920625

2 comments

  1. I am very glad to join in this website…I am Mr Polaiah Kukatlapalli Poet from Hyderabad
    Iam a writer of 7 Books . Iam interested in poems.. I have joined to publish my kavithalu… as I wrote more than 500 kavithalu.. Thanks you all for giving me this golden opportunity…. Polaiah Poet…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s