బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు నిర్మాత. ఈయనను బి.యన్.రెడ్డి అని పిలుస్తారు. ఉత్తమ కళాత్మక విలువలను వ్యాపారానికి జోడించి మంచి సినిమాలు తీసిన దర్శకుడు. బి.యన్.రెడ్డి కడప జిల్లాలోని పులివెందులలోని కొత్తపల్లి గ్రామంలో లో 16.11.1908న జన్మించాడు. వీరి తండ్రి నరసింహారెడ్డి ఎర్రగడ్డలను(ఉల్లిపాయలు) విదేశాలకు చేసేవాడు. బి.యన్.రెడ్డి1927లో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు.
1928 లో వాహిని పిక్చర్స్ స్థాపించి దేశభక్తిని ప్రభోదించే వందేమాతరం సినిమాలు తీశారు. 1951లో మల్లేశ్వరి సినిమాను ఎన్టీ రామారావు భానుమతిలను నాయికా నాయకులుగా తీశారు. ఇది అంతర్జాతీయ చెకింగ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడింది.1975లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన మొట్టమొదటి
దక్షిణాది వ్యక్తి ఇతనే.
బి.యన్.రెడ్డి దేవత, సుమంగళి,స్వర్గసీమ మొదలైన ఎన్నో చిత్రాలు తీశారు. 1954 రాష్ట్రపతి రజత పతకం పొందిన బంగారు పాప, రంగుల రాట్నం, భాగ్యరేఖ, రాజమకుటం, పూజాఫలం. బంగారు పంజరం లాంటి విశిష్టమైన చిత్రాలు నిర్మించారు. వీరు మద్రాసులో నిర్మించిన వాహిని స్టూడియో ఆసియాలోకెల్లా గొప్ప అధునాతన స్టూడియోగా పరిగణించబడుతోంది. వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ తోను, కేంద్ర ప్రభుత్వం “పద్మ భూషణ్ ” తోను సత్కరించారు. వీరు
8.11.19 77 లో చెన్నై లో మరణించారు.

రచన: పిళ్లా కుమారస్వామి,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s