
హంద్రీ_నీవా సుజల స్రవంతి కాలువ
ఈ ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలో 602500 ఎకరాలకుసాగునీరు అందించటానికి రూపొందించిన పథకం.
దీన్లో ఒక టిఎంసి లోపు నీరు కూడా పారడంలేదు.దీని మార్గంలో హంద్రీ,పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య, బాహుదా,గార్గేయ నదులు ఉన్నాయి . . ఈ కాలువ కాలువ రాయలసీమలోని నాలుగు
జిల్లాలకు సాగునీటినందిస్తుంది.
క్షామానికి గురౌతున్న ఈ నాలుగు జిల్లాలుఈ ప్రాజెక్టు వల్ల కొంత సాగునీటి సౌకర్యం పొంది, కరువు కోరల నుంచి కొద్దిగా ఉపశమనంగాపొందుతాయి. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం రిజర్వాయరు నుంచి 40టి.యం.సిల నీరు ఎత్తిపోతలపథకం తో క్రిష్ణా బేసిన్లోని మిగులు నీటి నుంచి బచావత్ అవార్డు ప్రకారం శాశ్వత హక్కులేని విధంగా ఉపయోగించు కోవడానికి తయారు చేసిన పథకం. ఆంధ్రప్రదేశ్ లో క్రిష్ణాబేసి లోని ప్రాజెక్టుల ప్రతిపాదనలు అపరిష్కృతంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 5.5టి.యం.సిల నీళ్లతో త్రాగునీటి పథకాన్ని కేంద్ర జలవనరుల సంఘం ఆమోదానికి పంపింది. ఈ నీరు ఆంధ్రప్రదేశ్ లో అవలంబించిన పంటల మార్పిడి వలన ఆదా అయిన 19.33టి.ఎం.సిల నుంచి వాడుకొంటామని నిర్ధారించింది. ఇరిగేషన్ కమాండ్ ఏరియా డిపార్టుమెంటు చీఫ్ ఇంజినీయర్లు హంద్రీనీవా ప్రాజెక్టును రాయలసీమలో కరువుల నుండి రక్షంచుటకు అందులోనుముఖ్యంగా అనంతపురం జిల్లాను ఆదుకోవచ్చని గుర్తించారు. అందులో 88టి.యం.సిల నీరు అనంతపురం జిల్లాకు లభించేటట్లు చేయవచ్చని క్రింద కనుబరచిన మేరకు సూచించినారు. టి.యం.సిలుపూడిక వల్ల ఎగువకాలువలోతగ్గిన నీరు 6.00నాగార్జున సాగర్ ఆయకట్టులో పంట మార్పిడి వల్ల ఆదా అయ్యేనీరు 19.33కె.సి.కెనాల్ నీరు పి.ఏబి.ఆర్.కు మల్లింపు వల్ల వచ్చే నీరు 10.00గోదావరి నుంచి క్రిష్ణాబేసిన్కు మళ్లించడం వల్ల 20.00పులిచింతల ప్రాజెక్టు వల్ల వచ్చే నీరు 10.00తుంగభద్ర మరియు క్రిష్ణానదుల నుంచి మిగులు నీరు 23.00
రాయలసీమలోనే పెద్ద కాలువ.అయినప్పటికీ దీనికి సమాంతర కాలువ నిర్మిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పారు.వాస్తవ రూపం దాల్చేదెప్పుడు?
కె . సి . కెనాల్ .
దీనినే కర్నూల్ – కడప కాలువ అంటారు . దీన్ని 150 సంవత్సరాలకు పూర్వమే నిర్మించారు .
కర్నూల్ జిల్లాలో సుంకేసుల బేరేజ్ నుండి మొదలైన ఈ నీటి పారుదల కాలువ కడప , కర్నూలు జిల్లాల్లో సాగునీటిని ,
తాగునీటిని అందిస్తుంది.