ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత ,దాని అనుబంధ వృత్తులపై ఆధారపడిసుమారుగా నాలుగు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు.వీరిలో ఇప్పటికి కూడా వేలాదిమందికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు.
చేనేత అనుబంధ వృత్తులలో నాలుగు లక్షల కుటుంబాలు అనగా ఒక్కో కుటుంబానికి ఐదు మంది చొప్పున ప్రకారం మహిళలతో కలిపి20 లక్షల మంది వున్నారు.
లక్డౌన్ ప్రకటించిన నాటి నుండి ఈ చేనేత వృత్తిని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిలుపుదల చేయించారు.చేనేత ఉత్పత్తులు రవాణా లేని కారణంగా మార్కెటింగ్ పూర్తిగా ఆగిపోయినాయి.
స్పిన్నింగ్ మిల్లులు మూసివేసిన కారణంగాచేనేతలకు అందవలసిన ముడి సరుకులు కూడా ఆగిపోయినాయి
ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తాంధ్ర ప్రాంతాల్లోతక్కువ నైపుణ్యం కలిగిన వస్త్రాలను ,రాయలసీమ ప్రాంతాల్లో జరీ చేనేతల ఉత్పత్తులు తయారు అవుతాయి. కానీ ప్రాంతాల వారిగా చేనేతల ఉత్పత్తిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించిన1000/- రూపాయలు మరియు బియ్యం , కందిపప్పు , తదితర వస్తువుల పంపిణీని అభినందిస్తున్నాము. కానీ , అవి దిగువ తరగతి చేనేతల కార్మికులకు అందలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొసైటీలకు రావలసిన69 కోట్ల రూపాయల పాత బకాయిలకు గాను24 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలచేయడం జరిగింది.విడుదల అయిన రూపాయలనుసహకార సంఘాలకు అందించకుండాఆ నిధులను వేరే వాటికి మళ్లించడం జరిగినది.సహకార సంఘాలకు ఒక్క రూపాయి కూడా అందలేదు.
ప్రస్తుత పరిస్థితుల రిత్యాచేనేత పరిశ్రమ రాబోయే రెండు సంవత్సరాలు కోలుకోలేదు.ఇప్పటికే అనేకమంది చేనేతలుమాస్టర్ వీవర్స్ దగ్గర , ఇతరుల వద్ద అధిక వడ్డీలతో అప్పులు చేసి వున్నారు.
ఈ కారణాలతో కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను తక్షణమే ఆదుకోవలసినఅవసరం ఎంతైనా ఉంది.
కరోనా లక్డౌన్ కారణంగా లక్డౌన్ ప్రకటించిన నాటి నుండి లక్డౌన్ ఎత్తి వేసే సమయం వరకు ..మరియు ఆ తర్వాత 6 నెలల సమయం వరకు5000 రూపాయలు చొప్పున జీవనభృతి క్రింద నేరుగా వారి వారి బ్యాంకులలో వ్యక్తిగత అకౌంట్లలలో వేయాలి. మరియు గుర్తింపు కార్డులు లేని చేనేత కార్మికులకు దాదాపుగా ఐదు సంవత్సరాలుగా ఇదే వృత్తిపైజీవిస్తున్న ప్రతీ ఒక్క చేనేత కార్మికులకుజీవనభృతిని వర్తింపజేయాలి.
అంతే కాకుండా చేనేతలకు ఒక్క సంవత్సరం కాలంపాటు ఉచిత వైద్య సదుపాయాలను అందజేయాలి.
ఇప్పటికే వారు ఉత్పత్తులు చేసినచేనేత వస్త్రాలను తక్షణమేకేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసివెంటనేవారికి నగదును అందజేయాలి.
అదేవిధంగా చేనేతలకు ఇచ్చినఅన్ని రకాలుగా వున్న రుణాలన్నీ పూర్తిగా రద్దు చేయాలి.
సిల్క్స్ సబ్సిడీల క్రింద చేనేతలకురావాల్సిన బకాయిలను వెంటనే బ్యాంక్ అకౌంట్లలలో జమ చేయాలి.
వెంటనే స్పిన్నింగ్ మిల్లులను ప్రారంభించి చేనేత

వెంటనే స్పిన్నింగ్ మిల్లులను ప్రారంభించి చేనేత లకు మొట్టమొదటగా కావాల్సినముడి సరుకును తయారు చేసి వారికే అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.
చేనేతలపై కేంద్ర ప్రభుత్వం విధించినఅన్ని రకాలైన పన్నులను శాశ్వతంగా రద్దు చేయాలి.A.చిలప నూలుపై 5%B.కెమికల్స్ పై 18 %C.రంగులపై 18%D.తయారైన వస్త్రాలపై 5%,మొత్తంగా 46% పడుతుంది.