K. R. Vijaya

పాత తరం హీరోయిన్లలో అందానికి, అభినయానికి పుత్తడిబొమ్మ లాంటి నటి కే .ఆర్. విజయ.

చాలామంది కె.ఆర్. విజయ తమిళమ్మాయినో, మలయాళ అమ్మాయినో అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పదహారణాల తెలుగు అమ్మాయి. రాయలసీమ ఆడపడుచు.

నాన్న రామచంద్ర చిత్తూరు, తల్లి కల్యాణి కేరళ రాష్ట్రంలోని త్రిచూర్. రామచంద్ర మిలిటరీలో పనిచేసే వారు.వీరిది ప్రేమవివాహం.

1948 నవంబరు 30 న కె.ఆర్. విజయ జన్మించారు. అసలు పేరు దైవ నాయకి.
సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో పేరు పలకడానికి బాగలేదని మార్చారు. తల్లి ,తండ్రి పేరులోని మొదటి ఆంగ్ల అక్షరాలను కలుపుకుని
కే .ఆర్. విజయ గా మార్పు చేశారు.

కే .ఆర్. విజయ వారి తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె. ఆమెకు మొత్తం నలుగురు చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఈవిడ త్రిశూర్ లోని పున్కున్నం సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది.

చిత్తూరు లో ప్రముఖ నటులు చిత్తూరు వి.నాగయ్య
వీళ్లు పక్కపక్క ఇళ్ళు. చిన్నప్పుడంతా వాళ్ళింట్లోనే పెరిగింది.

ఈమె నాన్నగారికి నాటకాలంటే చాలా ఇష్టం
ఎం.ఆర్.రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తుండేవారు.
ఈమె చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది. ఈమె నాన్న ఆయనతో పాటు తీసుకువెళ్ళి చిన్న చిన్న బాల పాత్రలు వేయించేవాడు.

పళని లో నేర్చుకున్న నాట్యంతో డబ్బు సంపా దించాలని తొలిసారిగా మధురైలో కాలికి గజ్జెలు కట్టిన
దరిమిలా చాల ప్రాంతాల్లో నాట్యాలు చేసి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు.

విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్యప్రదర్శనలు చేసేది.

పదకొండేళ్ళ ప్రాయంలోనే ప్రముఖ నటుడు ఎం.కె. రాధా
ఈమె తో స్టేజి నాటకాలు వేయించాడు.

ఆ అనుభవంతోనే రంగస్థల నటిగా మారారు. ప్రముఖ రచయిత బాలమురుగన్ బృందంలో చేరి నాటకాలు వేషాలు వేసారు.. ఈమె సొంతంగా ఒక నాటకాన్ని
నిర్మించారు.

మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు.

చెన్నైలోని ప్రముఖ వ్యాపార సంస్థ ‘సింప్సన్ తమ
సంస్థ తరఫున వేసిన కేలండర్ల పైన విజయ ఫోటో వేసింది

అదే ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. అదెలాంటి మలుపంటే ఏకంగా హీరోయిన్ చేసేసింది. ఆ సమయంలో తమిళంలో తీయబోయే ‘కర్పగం’ అనే సినిమాకు నూతన కథానాయిక కోసం వెదుకుతున్నా రట.

ఓ రోజు ఆ సినిమా యూనిట్ అంతా కూర్చుని ఉంటే ఓ వ్యక్తి సింప్సన్ చాక్లెట్ డబ్బాను అక్కడికి తీసు వెళ్ళాడు. దాని మీద ఉన్న విజయ ఫోటో చూసిన దర్శకుడు కె.ఎస్. గోపాలకృష్ణన్ ఈమె కు సినిమాలో హీరోయిన్ అవకాశమిచ్చారు.

ఒకప్పుడు ఈమెనృత్యాన్ని, నాటకాన్ని చూసి భవిష్యత్తులో హీరోయిన్ అవుతావని ప్రశంసించిన జెమినీ గణేశన్ అందులో హీరో.

కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో కె.ఆర్. విజయ రంగప్రవేశం చేసింది. అప్పుడు ఆమె వయస్సు 17 ఏళ్ళు.

ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.
అమరజ్యోతి పిక్చర్స్ పతాకంపై వచ్చిన కర్పగం విజయఢంకా మోగించింది.

1964లో గోపాలకృష్ణన్ అణావిన్అళై సినిమా నిర్మించారు. ఆ చిత్ర నిర్మాత సుదర్శన్ చిట్ ఫండ్ కంపెనీ యజమాని వేలాయుధన్ కు మంచి మిత్రుడు. ఆ చిత్రంలో హీరోగా శివాజీ గణేషన్ నటించగా హీరోయిన్ గా సావిత్రి తో పాటు కె.ఆర్.విజయ కూడా నటించారు. ఆ సమయంలోనే కె.ఆర్.విజయ వేలాయుధన్ తో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమ గా మారింది. ఆమె ప్రేమ ఏలా మైదలైంది ఓ సినీ పాత్రికేయునికి చెప్పినమాట ఇది.

వేలాయుధన్ ఫైనాన్షియర్. ఈ చిత్రంలో భాగస్వామి కూడా. అందువల్ల సినిమా ఒప్పందం ఫారం మీద సంతకం చేయమని పిలిపించారు. నేనువెళ్లి ఏమీ చదవకుండానే సంతకం చేసేశాను.

ఆయన ఆశ్చర్యపోతూ “ఈ ఫారంలో ఏమి రాసి ఉందో తెలుసా? నీ ఆస్తిపాస్తులన్నీ నాకు ఇచ్చేస్తున్నట్లు రాసి ఉంది. నువ్వేమో సంతకం చేసేశావు” అని వేళాకోళం చేశారు.

నేను అది విని ఏమాత్రం గాభరా పడకుండా
అబ్బో… ఎంత ఆశఅని నవ్వేశాను. అని మంచి
ముహూర్తంలో కలుసుకున్నాము.. మా మధ్య స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. 1968 ఏప్రిల్ 7న మా పెళ్ళి గురువాయూర్ లో జరిగింది.

ఇది అతనికిమూడో పెళ్లి. పెళ్లి విషయం చాలా రోజుల పాటు
రహస్యంగా ఉంచారు.
ఆ విషయం కొంత కాలం రహస్యంగానే ఉన్న వారిద్దరూ ఓ సారి కొలంబోకు విహారయాత్రకు వెళ్ళినప్పుడు విజయ అభిమాని ఒకరు ఫోటో తీసి దానిని బహిర్గతం చేయడం తో కె.ఆర్.విజయ వేలాయుధన్ వివాహం అందరికీ తెలిసిపోయింది.

1954 సంవత్సరం నుండి సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీకి యజమానిగా, అలాగే అశోక బ్రదర్స్ పేరిట ఉన్న కొన్ని ఓడలు, బెంగుళూరు నగరాల్లో స్టార్ హోటల్లో అధిపతిగా ఉన్న వేలాయుధన్ కోట్లకు అధిపతి . కె.ఆర్. విజయ ఇంట్లో ఈ వివాహం ను వ్యతిరేకించారు.చాలా కాలం
పుట్టినింటికి దూరమైంది.

అప్పటికే వేలాయుధన్ కు శారద, విలసిని అనే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. విజయ వేలాయుధన్ కు మూడో భార్య. అప్పట్లోనే వేలాయుధన్ కు సొంత విమానం ఉండేదంటే ఆయన ఎంత కోటీశ్వరుడో మనం గ్రహించవచ్చు.

ఆ విమానాన్ని వేలాయుధం తన భార్య విజయకు వివాహ బహుమతిగా ఇచ్చాడని చెప్పుకునేవారు.
కె ఆర్ విజయ , వేలాయుధం కు ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు హేమలత.

నిజానికి వివాహం తర్వాత కె.ఆర్.విజయ సినిమాల్లో స్వస్తి చెబుదామనుకున్నా దానికి భర్త వాదించి ఆమెను సినిమాల్లో నటించేందుకు తగు ప్రోత్సాహం ఇచ్చాడు. దానికి కారణం ఆయన సినీ నిర్మాత కాబట్టి.

కె .అర్. విజయ
శ్రీ కృష్ణ పాండవీయం చిత్రం తో తెలుగు సినీ రంగానికి పరిచయం చేసారు. ఆ చిత్రం లో రుక్మిణి పాత్ర లో ముగ్ద మనోహరం గా కనిపించి అందరిని ఆకట్టుకున్నది.

శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు అనగానే తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ ఎలా జ్ఞాపకం వస్తాడో, అమ్మ వారు అనగానే తమిళ ప్రేక్షకులకు కే.అర్. విజయ జ్ఞాపకం వస్తారు.

అమ్మ వారి పాత్రలలో ఆమె అంతగా మెప్పించింది. రామునిగా. కృషునినిగా ఎన్టీఆర్ తెలుగు వారి ఇంట వెలిస్తే, కే.అర్. విజయ గారు తమిళుల పూజ గది లో అమ్మవారి గా వెలిశారు.

లవ కుశ నిర్మాత శంకర్ రెడ్డి గారు నిర్మించిన సతి సావిత్రి లో ఎన్టీఆర్ యమధర్మరాజు గా నటిస్తే, కే.అర్.విజయ జగన్మాత గా నటించారు.
బాలకృష్ణ హీరో గా నటించిన భైరవ ద్వీపం లో ఈమె నటించింది.

ఎన్టీఆర్ తో ఒక పౌరాణికం, మూడు జానపద, రెండు సాంఘిక సినిమాల లో నటించింది. అవి శ్రీ కృష్ణ పాండవీయం, పరమానందయ్య శిష్యుల కథ, భలే తమ్ముడు, ఏకవీర ,లక్ష్మి కటాక్షం , ప్రేమ సింహాసనం.

విజయ భర్త వేలాయుధన్ తమిళం, మలయాళం భాషల్లో 60కి పైగా సినిమాలను నిర్మించాడు. అలాగే తన భర్త సహకారంతో కె.ఆర్.విజయ ఏకంగా పది సంవత్సరాల్లో 100 సినిమాలకు పైగా నటించారు. ఇప్పటి కూడా ఆవిడ తల్లి, భామ పాత్రలో తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

విజయ భర్త వేలాయుధన్
26 మార్చి 2016 లో మరణించారు.

కె.ఆర్.విజయ దక్షిణభారత సినీనటి. పున్నాగై అరసి (పున్నాగ పూల వంటి నవ్వులు కలది) అని బిరుదునందుకున్న విజయ నాలుగు దశాబ్దాలపాటు సినీరంగములో పనిచేసింది.
బుల్లితెర పైన , వెండితెరపైన
కె.ఆర్. విజయ ఇంకా నటిస్తున్నారు.

తమిళ ప్రజలుఓ పెద్ద అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించి వైన్నాగే అరసి’ అనే బిరుదుతో గౌరవించారు. అంటే కవ్వుల రారాణి’ అని అర్థం. ఈ బిరుదంటే ఆమెకెంతో ఇషం.
2009 లో ఈమె కుసత్యభామ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.

✍️సేకరణ:–చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s