
మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా ‘ భక్తప్రహ్లద ‘. 1932 ఏప్రిల్ 2 శనివారం ‘నేషనల్ పిక్చర్ ప్యాలెస్’ (ఇప్పటి బాడ్వే టాకీస్)లో విడుదలై రెండు వారాలు ఆడింది. ఇందులో నటించిన మొదటి తరం సినిమా నటి సురభి కమలా బాయి. మొదట్లో మూకీ సినిమాలుండేవి. బాంబే వేదిక గా సినీపరిశ్రమ ఉండేది. తరవాత మద్రాసు కు చేరింది.
సురభి కమలాబాయి తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని.ఈమె 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము భక్తప్రహ్లాద లో లీలావతి పాత్ర ధరించింది.
సురభి కమలాబాయి 1908ఏప్రిల్4న జన్మించినట్లు చెబుతున్నారు.తండ్రికృష్ణాజీరావుతల్లివెంకూబాయి.
సురభి నాటక కళాకారుల కుటుంబములో జన్మించింది. ఈమె తల్లి వెంకూబాయి గర్భవతిగా ఉండి హైదరాబాదు లో ఒక నాటకములో దమయంతిపాత్రవేస్తున్నప్పుడు పురిటినొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలముమీదే సురభి కమలకుమారి ని ప్రసవించడం విశేషం. అనంతరం కమలాబాయి పేరు తో వెలుగులోకి వచ్చింది.
ప్రేక్షకులుఇదికూడానాటకములోభాగమనుకొన్నారు. తీరా విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకులు చంటిబిడ్డ మీద డబ్బుల వర్షం కురిపించారు.
కమలాబాయి గురించి తెలిపే ముందు సురభి రంగం గురించి క్లుప్తంగా వివరింఛక తప్పదు.
ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885లో కడప జిల్లాలోసురభిగ్రామంలో ‘కీచక వధ’నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు.
1885లో వనారస సోదరులు వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్య కలిసి చక్రాయపేట మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందినది.

రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే.
సెట్టింగ్లు, ట్రిక్స్, ఆహార్యంతో ప్రేక్షకులను నాటకం ఆసాంతం కదలకుండా కట్టిపడేసేదే సురభి నాటకం. నాటక రంగంలో చూస్తే దేశంలో మరే సమాజానికి లేనంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కుటుంబం సురభి. వారి మాటల్లో చెప్పాలంటే తాము ప్రదర్శించే నాటకం ఓ దృశ్యకావ్యం… కళ్లతో చూసేది సురభి వారి నాటకమేనని గర్వంగా చెబుతారు.
సురభి కమలాబాయి సురభి
రంగస్థల కుటుంబంలో పుట్టిన కమలాబాయికి చిన్నప్పటి నుండేనటనఅలవాటయ్యింది. బాల్యంలో కృష్ణుని, ప్రహ్లాదుని పాత్రలు వేస్తుండేవారు. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. అందరూ మహిళలే నటించి విజయవంతమైన నాటకంలో ఆమె సావిత్రి పాత్రను పోషించింది.

బాల్యం నుంచి రంగస్థల నటిగా ఎదుగుతూ హెచ్.ఎం.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’లో హిరణ్యకశపునిగా నటించిన మునిపల్లె వెంకటసుబ్బయ్య సరసన లీలావతిగాపరిచయమయ్యారు. భక్తప్రహ్లద సినిమాలో సురభి కమలాబాయి నాయిక గా నటించే నాటికి ఆమె వయస్సు 23యేళ్లు. హరిశ్చంద్రుని భార్య గా నటించింది. పారితోషకం 500రూపాయలు. ఆరోజుల్లో ప్లేబ్యాక్ పద్దతి లేదు. నటిస్తూ పాడాల్సిందే.
ఈ సినిమా నిర్మాణం కోసం మనటాకీలమూలపురుషుడైన దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి ఎంతో ప్రయాసపడ్డారు. సురభి నాటకకంపెనీవారితోనే ఇందులో ఎక్కువ వేషాలు వేయించారు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాభాయి, మాస్టర్ సింధూరి కృష్ణారావు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎల్వీప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. టైటిల్ రోల్ చేసిన మాస్టర్ కృష్ణారావునే మన తొలి తెలుగు కథానాయకునిగా చెప్పుకోవాలి.

తెలుగులో మాటలు, పాటలున్న భారత్ మూవీటోన్ వారి భక్తరస చిత్రం ‘భక్తప్రహ్లాద్’ త్వరలో విడుదల” అనే ప్రకటన 1932 జనవరి 31 ‘ది బాంబే క్రానికల్’లో వచ్చింది. ముంబయిలోని న్యూ ఛార్నీ రోడ్డులో ఉన్న ‘కృష్ణాసినిమా’అనేథియేటర్లో తొలిసారిగా ‘భక్త ప్రహ్లాద’ చిత్రం విడుదలైంది. 1932 ఫిబ్రవరి 6 నాటి ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రిక సంచికలోనే ‘భక్త ప్రహ్లాద’ రివ్యూ కూడా చూడవచ్చు.
తరువాత సర్వోత్తమ బదామి దర్శకత్వంలో సాగర్ ఫిలింస్ రూపొందించిన ‘పాదుకా పట్టాభిషేకం’లో సీతగా అద్దంకి శ్రీరామమూర్తి సరసన నటించింది.రెండవ సినిమా
‘ శ్రీరామ పాదుకాపట్టాభిషేకం’ సినిమాలో ఈమె సీత పాత్రలో నటించింది. తెలుగు ఇండస్ట్రీలో మొదటి సీత పాత్ర ఈమెదే.
సాగర్ ఫిలింస్ బాదామి సర్వోత్తంతో రూపొందించిన ‘శకుంతల’లో శకుంతలగాయడవల్లిసూర్యనారాయణతో నటించారు.
బి.వి.రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలింస్ నిర్మించిన ‘సావిత్రి’లో సావిత్రిగా టైటిల్ రోల్ పోషించారు.సరస్వతిసినీటోన్ నిర్మించిన ‘పృథ్వీపుత్ర’లో ఓ ముఖ పాత్ర పోషించారు.
కమలాబాయి ప్రతిభ గురించి విని, ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని బొంబాయికి ఆహ్వానించాడు. అక్కడే పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించింది.
మహాభారతం వంటి 25 చిత్రాలలో నటించింది. హిందీ సినిమాలలో నటిస్తున్నప్పుడే ఈమెకు సిగరెట్లు త్రాగటం అలవాటయ్యిందని చెబుతున్నారు. షూటింగ్ మధ్యలో ఆదరాబాదరాగా వెళ్ళి సిగరెట్టు త్రాగేదట.
1939లో విడుదలైన భక్తజయదేవ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలో నటించడం ప్రారంభించింది. విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. ఈ రెండుభాషలలోనూకమలాభాయే కథానాయకి. ఆ చిత్రంలో రెంటచింతలసత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే బెంగాలీ ఆయన దర్శకుడు. కథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి చిత్రాన్ని పూర్తిచేసిఅందర్నీఆశ్చర్యపరచింది కమలాబాయి. అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం దర్శకుడిగా హిరెన్ బోస్ పేరే కనబడుతుంది.

అలాగే తొలి ద్విభాషా చిత్రమైన తుకారాం (1940) తెలుగు వెర్షన్లో ఈమె నటించింది. అప్పటి వరకు కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు కే పరిమితమైంది. ఈమెనటించిన కొన్ని సినిమాలు…
భక్తప్రహ్లాద (1931) – లీలావతి
శకుంతల (1932)
పాదుకా పట్టాభిషేకం (1932) – సీతాదేవి
సావిత్రి (1933)
పృథ్వీపుత్ర (1933)
షెహర్ కా జాదూ (1934) – లైలా
ద్రౌపదీ మానసంరక్షణం (1936)
దో దివానే (1936)
బేఖరాబ్ జాన్ (1936)
తుకారాం (1938)
భక్త జయదేవ (1938)
భూకైలాస్ (1940)
మంగళ (1951)
పాతాళభైరవి (1951)
మల్లీశ్వరి (1951)
దేవదాసు (1953)
మాంగల్యబలం (1958)
పెళ్లినాటి ప్రమాణాలు (1958)
జయభేరి (1959)
వాగ్దానం (1961)

వీటిలో చాలా సినిమాలు ప్రింట్లు కూడ లేవు. ఇదే పేర్ల తో మళ్లీ చాలా సినిమాలు తీశారు.
కమలాబాయి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు ముప్ఫై వేలను భవిష్యత్తు అవసరాలకై ఒక బ్యాంకులో డిపాజిట్టు చేయగా, ఆ బ్యాంకు దివాళా తీసి, తన డబ్బు కోల్పోయి చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నది. వయసు మీదపడి సినిమాలలో అవకాశాలు సన్నగిల్లినా ఇంట్లో ఊరకే కూర్చోలేక తన అక్క కూతురైన సురభి బాలసరస్వతితో పాటు షూటింగులకు వెళుతుండేది. అవసాన దశలో ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడింది. 1971, మార్చి 30న మరణించింది. తొలి తరం తెలుగు సినీనటి.
