
ఆమె అందం , అభినయం అనన్యం… నేటితరం కు అంత తెలియక పోవచ్చుఆమె… పరిచయం లేని రాయలసీమ వాసి… హిందీలో చాలా తక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన భావాలకు చిత్రరంగంకు పొంతన కుదరక తప్పుకొంది.
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామానాయుడు కుమార్తె అందాలనటి లీలా నాయుడు.
ప్రపంచంలో పది మంది కి డబ్బింగ్ చెప్పింది. మ్యాగజైన్ ఎడిటర్ గా పనిచేసింది. సినిమాలు నిర్మించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి లీలా నాయుడు.
నటీమణి, ప్రపంచ సుందరి లీలా నాయుడు తెలుగు మూలాలు ఉన్న భారతీయ నటి. ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లె కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె.
రామయ్య పారిస్ లోని యూనెస్కో శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన మార్తా ను ఆయన వివాహం చేసుకున్నారు. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయాల్లో పరిశోధకురాలు(Indologist)
లీలా నాయుడు 1940 జులై 28న జన్మించారు. ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది. హిందీ సినిమా ల్లో నటించి పేరు సంపాదించుకున్నది. లీలా నాయుడు రాయలసీమ వాసి అనడానికి తండ్రి పత్తిపాటి రామయ్య నాయుడు గురించి ఇదే సందర్భంలో కొంత తెలపాలి.
రామానాయుడు చిత్తూరు జిల్లా, మదనపల్లిలో 1904 జూన్ 3 న జన్మించాడు. చిన్న వయసులోనే ఇల్లు వదలి పుదుచ్చేరి లోని అరవిందాశ్రమములో చేరాడు. పిదప బెంగాల్ లోని శాంతినికేతన్లో గణితశాస్త్రము బోధించాడు. కాశీ లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయములో 1923 లో పట్టభద్రుడయ్యాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో 1929లో ఎం.ఎస్.సి. 1933లో డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నాడు.
ఇతడు తన డాక్టోరల్ థీసిస్ కొరకు క్యూరీ-కార్నెగీ రీసర్చ్ ఫెలోషిప్‌లో భాగంగా పారిస్ లోని రేడియమ్ ఇన్స్టిట్యూట్ లో మేడం క్యూరీతో కలిసి పనిచేశాడు. తరువాత ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ పాట్రిక్ బ్లాకెట్ పర్యవేక్షణలో పరిశోధనలు చేసి 1936లో డాక్టరేట్ పట్టా పోందాడు.
1936లో బొంబాయిలోని టాటా ట్రస్టు కేన్సర్ వ్యాధి చికిత్స కోసం రాడాన్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడానికి మన దేశానికి ఇతడిని ఆహ్వానించింది. 1938లో ఇతడు రేడియం సంగ్రహణ పరికరాలతో పాటు 2 గ్రాముల రేడియంతో బొంబాయిలోని టాటా మెమొరియల్ హాస్పెటల్‌కు వచ్చారు.
ఇతని పర్యవేక్షణలో దేశంలోని మొట్టమొదటి రాడాన్ ప్లాంట్ నిర్మించబడి 1941 ఫిబ్రవరి 28న టాటా మెమొరియల్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ఆసుపత్రి 1952లో భారత ప్రభుత్వపు అణు ఇంధనశాఖ కు బదిలీ అయ్యింది. లీలా ముంబైలో ఉన్నప్పుడు జన్నించింది.
1954లో పదనాలుగు సంవత్సరముల వయసులో
ఫెమినా మిస్ఇండియా గా ఎన్నుకొన బడింది.
వోగ్ పత్రిక లీలను మహారాణి గాయత్రీ దేవి సరసన పదిమంది మహాసౌందర్యవతులలో ఒకరిగా పరిగణించింది.
1960లో “అనూరాధ” అనే హిందీ సినిమా తో లీల హిందీ చిత్ర రంగంలో అడుగు పెట్టింది.హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, బలరాజ్ సాహ్ని కథానాయకుడు.

మిస్ ఇండియాగా ఎన్నికైన లీలా నాయుడు తొలిసారి ఇందులో హీరోయిన్గా నటించగాఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా బంగారు పతకం బహుమతి లభించింది.
1961లో బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఉత్సవాలలో భారతీయ ఎంట్రీగా ఈ చిత్రాన్ని నామినేట్ చేశారు. లీలకు పండిత్ రవి శంకర్ పాటలు కూర్చాడు.
ఆర్. కె.నాయర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా 1963 లో
“యే రాస్తే హై ప్యార్ కే” చిత్రములో లీల నటించింది.
కెఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర కోర్టు కేసు ఆధారంగా నిర్మించిన ఏ రాస్తే హై ప్యార్ కే సినిమాలో సునీల్ దత్ సరసన పోషించిన పాత్ర ఆమెకు ఎనలేని పేరు తెచ్చి పెట్టింది.

1962లో “ఉమ్మీద్” 1963లో మర్చంట్-ఐవరీ వారి థౌజండ్ హౌస్ హోల్డర్,1980 లో శ్యామ్ బెనెగల్ “త్రికాల్” లలో నటించింది. లీలానాయుడు చేసింది కొద్ది సినిమాలే అయినా బాలీవుడ్ చిత్రసీమపై చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి.
సత్యజిత్ రే.. లీలాలోని పర్సనాలిటీ నచ్చి.. ఆమెతో ఇంగ్లీష్ సినిమా చేయాలను కున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్
వర్కవుట్ కాలేదు. అప్పట్లో ప్రముఖ వస్త్ర సంస్థ ఫిలిం
ఫ్యాబ్రిక్స్ కోసం ఆమెతో కలిసి శ్యామ్ బెనగల్ ఓ వ్యాపార ప్రకటన చేశాడు.
ఓ డాక్యుమెంటరీ కార్యక్రమాలను రూపొందించింది. హాంకాంగ్ సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది.
1956లో 17 ఏళ్ల వయస్సు లో ఓబెరాయ్ హోటళ్ళ స్థాపకుడు మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ ఒబెరాయ్ అలియాస్ టికీ ని పెళ్ళాడింది.మాయ, ప్రియ అను కవలకుమార్తెలను కన్న పిదప టికీ ఒబెరాయ్ తో విడిపోయి విడాకులు తీసుకొంది.

1969లో బొంబాయి కి చెందిన కవి, రచయిత, తన చిన్ననాటి
స్నేహితుడు అయిన డామ్ మోరిస్ పెండ్లి చేసుకొంది.హాంకాంగ్, న్యూయార్క్, ముంబాయి లో చాలా కాలం గడిపింది.రెండో భర్త తో కూడా విడాకులు తీసుకొంది. ఒంటరితనంతో చాలా పోరాడింది. లండన్‌లో ఉండగా జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీకి ఆకర్షితులైంది ఆ తరువాత ముంబైకి మారింది. 1992లో వచ్చిన ఎలక్ట్రిక్ మూన్” ఆమె చివరి సినిమా.
అందాలనటి లీలనాయుడు 2009 జులై 28న ముంబాయి లో మరణించింది.
