Father vincent ferrer

అనంతపురము జిల్లాలోని పేద ,బడుగు, బలహీన వర్గాల , దళిత, గిరిజన హృదయాల్లో గుడి కట్టుకొని దేవుని గా ,మహానుభావునిగా పూజలందుకొంటున్నారు ఫాదర్ విన్సెంట్ ఫెరర్. సేవకు మారుపేరు గా ఖ్యాతి గడిచిన పుణ్య జీవి ,ధన్య జీవి ఆయన. ఈ పుణ్య పురుషుని గురించి ఏంత చెప్పినా తక్కువే.

ఫాదర్ గురించి చెప్పడానికి నాకు తెలిసిన అక్షరాలు సరిపోవడం లేదు. అత్యంత వెనుకబడిన అనంతపురము జిల్లా లో ఏన్నో ఏన్నెనో కార్యక్రమాలు నిర్వహించారు. విద్య ,వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగం, పర్యావరణం, గృహనిర్మాణం, మహిళా సంక్షేమం ఇలా అనేక రంగాలను అభివృద్ధి చేశారు. పేదరిక నిర్మూలన చేపట్టారు.

కరవు కరాళ నృత్యం చేస్తున్న అనంతపురము జిల్లాలో ప్రజలు ఆకలి దప్పిక తో విలవిలాడుతున్న పరిస్థితి లో జిల్లా ప్రజలకు ఓ ఆశాజ్యోతి గా ఆర్ డి టి సంస్థ వెలసింది. శ్రీయుతులు విన్సెంట్ ఫెరర్ గారు ఆర్ డి టి సంస్థ ద్వారా ఎన్నో ఎనెన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ అండగా నిలిచారు. వారి సేవలకు జిల్లా వాసిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.విన్సెంట్‌ ఫెర్రర్‌ 1920 ఏప్రిల్‌ 9న స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనాలో జన్మించారు.* తండ్రి విన్సెంట్ తల్లి థెరిసా. ఫెరర్ పూర్తి పేరు విన్సెంట్ ఫెరర్ మ్యాంచు. ఫాదర్ అన్నది ఆయన సేవలకు గుర్తింపు గా వచ్చింది. ఆయన16 సంవత్సరాల వయస్సు లో స్పానిష్‌ ఆర్మీలో సైనికుడిగా చేరారు. స్పెయిన్ లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. దీనికి వ్యతిరేకత జనరల్ ఫ్రాంకో అంతర్యుద్ధం సృష్టించారు.మారణహోమం జరిగింది .

ఆ సమయంలో సైన్యం లో విన్సెంట్ ఫెరర్ మ్యాంచు పనిచేశారు. స్పెయిన్ అంతర్యుద్ధం అతన్ని కలచివేసింది.

1938 లో ఎబ్రో తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. తన ఏడు సంవత్సరాల సైనిక సర్వీస్ పూర్తి చేసి బయటకు వచ్చారు.

1944 లో లా కోర్సు చదువుతూ అర్దాంతరంగా మానేశాడు . క్రిస్టియన్ మిషనరీ లో చేరాడు. ది సొసైటీ ఆఫ్ జీసస్ అనే మత సంస్థ లో చేరాడు. 1952లో మతప్రచారకునిగా మొదట మన దేశంలో మహరాష్ట్ర చేరుకొన్నారు.

అక్కడ పరిస్థితులు చూశాక ఆయన చలించిపోయారు. మతప్రచారం కన్నా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర షేర్ కారీ సేవా మండలి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.

మన్మాడ్ ప్రాంతంలో వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్పెయిన్ ఆర్థిక సహకారం తో మొట్టమొదట ఓ పెద్ద వ్యవసాయ బావి ని తొవ్వించారు. అదే సేవా కార్యక్రమాలకు అంకురార్పణ.

అనంతరం 1073 బావులతో పాటు 800బోర్లువేయించారు.
పాఠశాలను నెలకొల్పడంతో పాటు ఆసుపత్రులు నిర్మించారు. ఆ ప్రాంత రూపురేఖలు మార్చేశారు.

ఇది సహించలేక అప్పట్లో ఆయన సేవా కార్యక్రమాలకు కొందరు ఆటంకాలు సృష్టించారు. ఆ ప్రాంతవడ్డీవ్యాపారులు , కొందరు స్వార్థపరులు మతం, విదేశీయత ఇలా అనేక వివాదాలు సృష్టించారు.

1968లో ‘గోబ్యాక్‌ ఫెర్రర్‌’ నినాదంతో ఆందోళనలు జరిగాయి. మహరాష్ట్ర ప్రభుత్వం దేశ బహిష్కరణ విధించింది.

ఏలాంటి తప్పు చేయలేదని ఎందుకు దేశం విడిచి వెళ్లాలో తెలపండని పోరాటం చేశారు. ఈయనకు మద్దతు గా సాంఘిక కార్యకర్తలు ,మేధావులు, ప్రజాస్వామ్య వాదులు పాత్రికేయురాలు అన్నె అండగా నిలిచారు.

దీంతో ఆయన్ను అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పిలిచిమీ తప్పులేదు అయినా స్పెయిన్ వెళ్లి మూడు నెలల తర్వాత తిరిగి రమ్మని చెప్పింది.

అదే సమయంలో అక్కడున్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.. ఫెర్రర్‌తో మాట్లాడుతూ అనంతపురం జిల్లా దుర్భిక్ష పరిస్థితుల గురించి వివరించారు.

స్పెయిన్ వెళ్లిన విన్సెంట్ ఫెరర్ మతకార్యక్రమాలను, సంస్థ ను వదలి పెట్టారు. తిరిగి 1969లో అనంతపురం జిల్లా కు వచ్చారు. ఆర్డీటీ ద్వారా ‘అనంత’లో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికీ ఈ సంస్థ సేవలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి.

1970 ఏప్రిల్ లో అన్నే , విన్సెంట్ ఫెరర్ మ్యాంచూ పెళ్లి చేసుకొన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. తార , మ్యాంచు మరియు యమున. అన్నే ఫెరర్ 1947 ఏప్రిల్ 10 న బ్రిటన్ లో జన్మించింది.
కరెంట్ వీక్లీ పతిక్ర జర్నలిస్ట్ గా భారతదేశం లోకి వచ్చింది.
ఫెరర్ ను దేశ బహిష్కరణ చేసిన సమయంలో ఆయనకు అండ గా పోరాటం చేసింది.

ఫాదర్ విన్సెంట్ ఫెరర్ ఫౌండేషన్ కు అన్నే ఫెరర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

ఆర్డీటీ సంస్థ మొదట కళ్యాణదుర్గం ప్రాంతంలో కరవు పనుల కార్యక్రమం తో చెరువు పూడికలు తీయడం కాలువలు తవ్వడం తో ప్రారంభించారు.

బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కణేకల్లు, అనంతపురంలోని ఆర్డీటీ ఆస్పత్రులు నిత్యం వేలాది మందికి వైద్యసేవలు అందిస్తున్నాయి.

అనంతపురం నగర శివారులో 2002లో ప్రారంభించిన స్పోర్ట్స్‌ సెంటర్‌ (అనంత క్రీడాగ్రామం) క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, జూడో, టెన్నిస్‌ తదితర క్రీడల్లో జాతీయ, అంర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తోంది.

వందల సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా గ్రామాల్లో ఆర్డీటీ విద్యను అందిస్తోంది. అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటునిస్తోంది.
స్వయంసహాయకసంఘాలను ఏర్పాటుచేసి మహిళల ఆర్థికస్వావలంబనకు కృషి చేస్తోంది. బదిర విద్యార్థులకు ప్రతేక పాఠశాలలు నిర్వహిస్తున్నారు.
దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు, వికలాంగులకు వేలసంఖ్యలో పక్కాగృహాలను నిర్మించి ఇచ్చింది.

తాత్కాలిక సాయం ఒక వైపు అందిస్తూనే ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే అనేక చర్యలు చేపట్టారు. ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడానికి నిస్వార్థంగా నిజాయితీగా పలు కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. విద్య , వైద్య, గృహ నిర్మాణం, ఉపాధి,కరవు నిర్మూలన తదితర అనేక కార్యక్రమాలు చేపట్టారు.

శుభ్రత, పొదుపు ప్రజలకు నేర్పిస్తున్నారు. మానసిక వికాసం కోసం క్రీడారంగాన్ని , గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నారు.
విపత్కర పరిస్థితుల్లో జిల్లా ప్రజలను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ముందు నిలుస్తున్నారు.

ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ .భగవంతుడు తాను అన్ని చోట్ల ఉండలేక ఇలాంటి వారిని పంపిస్తారని అనడంలో అతిశయోక్తి లేదు.

ఫాదర్‌ ఫెర్రర్‌ సేవలకు ఏన్నో అవార్డులు అందుకొన్నారు.
★1998లో ప్రిన్స్‌ ఆఫ్‌ స్పెయిన్‌ అవార్డు. అదే ఏడాది ★‘యూనివర్సల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది పీస్‌’ అవార్డు.
★2000లో జనరల్‌ ఇటాట్‌ ఆఫ్‌ క్యాటలోనియా అవార్డును సెయింట్‌ జార్జ్‌ క్రాస్‌ అందించింది.
★2001లో యూనెస్కో ‘లీడింగ్‌ ఫిగర్‌ ఇన్‌ ది హిస్టరీ ఆఫ్‌ ది 20 సెంచరీ’ అవార్డుతో సత్కరించింది.
★2009లో స్పానిష్‌ ప్రభుత్వం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ సివిల్‌ మెరిట్‌’ అవార్డుతో సత్కరించింది. స్పెయిన్ దేశం ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ★‘లాగ్రాన్ క్రేజ్‌డీల్ మోటోపివిల్ అవార్డు, ★ఒలంపిక్ స్పిరిట్ ఫ్రీడ్ వంటి పురస్కారాలే కాకుండా పలు సంస్థలు, దేశాలు ఇచ్చే ఉత్తమ పురస్కారాలన్నింటిని ఫెర్రర్ కు ప్రదానం చేశారు.

ఇలా ఇంకా అనేక అవార్డులు, సత్కారాలు, ప్రశంసా పత్రాలు అందుకొన్నారు.
★2007 లో అనంతపురం యస్. కె. యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
★2000 లో స్పెయిన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెలెన్సికా,★2001 లో స్పెయిన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హ్యులేవా గౌరవ డాక్టరేట్ పట్టా అందజేశాయి.

ఫాదర్ విన్సెంట్ ఫెరర్ సేవాకార్యక్రమాలను వివరిస్తూ
స్పెయిన్ దేశానికి చెందిన దర్శకుడు స్పానిష్ భాషలో ఓ సినిమా నిర్మించారు.

ఆ సినిమాలోకరువు నేలకు ఆపన్నహస్తం అందించిన మహనీయుడు
పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆపద్బాంధవుడు అని తెలియజేశారు.

2009మార్చి 20 న తీవ్ర అనారోగ్యంతో అనంతపురము ఆస్పత్రి లో చేరారు.చికిత్స పొందుతూ2009 జూన్ 19 న కానరాని అనంతలోకాలకు తరలి వెళ్లారు.

సేవే మార్గం..మానవత్వమే మతంగా సామాన్యుల పెన్నిధిగా జిల్లా వాసుల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మిగిలిపోయారు.

ప్రస్తుతం ఆర్డీటీ నిర్వహణను ఆయన సతీమణి అన్నే ఫెర్రర్‌, కుమారుడు మాంఛో ఫెర్రర్‌ చూస్తున్నారు. ‘ఫాదర్‌’ చూపిన బాటలోనే సంస్థ సేవలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

కరోనా విపత్తు సమయంలో అనంతపురము జిల్లా ప్రజలను ఆదుకోవడానికి 3 కోట్ల (మూడు కోట్ల) రూపాయలు విరాళం అందించారు. అంతే కాకుండా ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, భోజనాలు అందిచారు.

లాక్‌డౌన్‌తో సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందు లు పడుతున్న జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన 150మందికి పైగా వలస కార్మికులకు రూ.3లక్షలకుపైగా రవాణా, భత్యం అందించారు.

ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా అన్నేఫెర్రర్‌, ప్రోగ్రాం డైరెక్టర్‌ గా మాంచో ఫెర్రర్‌, హాస్పిటాలిటీ డైరెక్టర్‌ గా విశాలాఫెర్రర్‌ కొనసాగుతూ ఫాదర్ విన్సెట్ ఫెరర్ స్థాపించిన ఆర్డీటీ సంస్థ ను విజయవంతంగా నడుపుతున్నారు. బత్తలపల్లి వైద్యశాలను కోవిడ్ వైద్యశాల గా మార్చి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకొంటున్నారు.

పేద ప్రజల ఆశాజ్యోతి ఆర్ డి టి సంస్థ సేవలువెలకట్టలేనివి .
సంస్థవ్యవస్థాపకుడు శ్రీయుతులు దివంగత విన్సెంట్ ఫెరర్ గారికి పాదాభివందనం. ప్రస్తుత నిర్వహకులు శ్రీమతి అన్నేఫెరర్ గారికి, మ్యాంచూఫెరర్ గారికి , విశాల ఫెరర్ గారికి సంస్థ ప్రతినిధులకు శతకోటి వందనాలు.

✍️సేకరణ:– చందమూరి నరసింహా రెడ్డి. ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహా రెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s