1840ల నాటి ఈ రాయలసీమ మ్యాప్ ద్వారా ఎన్నో చారిత్రక విషయాలు

1840 map
 1. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ – 1928లో రాయలసీమ అనే పేరు పెట్టకముందు వరకు ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలాలు అని పిలిచేవారు
  2.రెండు జిల్లాలు – చిత్రంలో కేవలం బళ్లారి మరియు కడప జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పటికి కర్నూలు పూర్తి జిల్లాగా ఏర్పడలేదు. అనంతపురం బళ్లారి జిల్లాలో భాగం మరియు చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది.
 2. కడప జిల్లా – ఇప్పుడు కడప జిల్లా చిన్నగా రాష్ట్ర / దేశ సరిహద్దు లేని జిల్లా కానీ 1840లలో కడప చాలా పెద్ద జిల్లా. ఒకవైపు మైసూరు, మరోవైపు ఆర్కాటు రాజ్యం /గుంటూరు, నెల్లూరు సరిహద్దుగా విస్తరించిన జిల్లా. ఇప్పుడు అనంతపురం లో ఉండే కదిరి, చిత్తూరు జిల్లాలో ఉండే మదనపల్లి, వాయలపాడు, పుంగనూరు, కర్నూలు జిల్లాలో ఉండే కోవెలకుంట్ల, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలు అన్నీ ఒకప్పుడు కడప జిల్లాలో భాగం
 3. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు – ఈ మ్యాపు తయారు చేసే నాటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు చేసిన కోయిలకుంట్ల, కంభం ప్రాంతాలు అన్నీ కడప జిల్లాలోనే ఉండేవి. సాంకేతికంగా తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా మనం చెప్పుకునే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తిరుగుబాటు కడప జిల్లాలో జరిగింది.
 4. హండే అనంతపురం – మ్యాపులో అనంతపురం పట్టణం పేరు అనంతపురం అని కాకుండా హండే అనంతపురం అని ఉంది. అనంతపురం పట్టణాన్ని నెలకొల్పి 250 సంవత్సరాలు పాలించిన హండే వంశస్థుల పేరు మీద అనంతపురాన్ని హండే అనంతపురం అనేవారు ఈ హండే అనంతపురం / అనంతపురం కేంద్రంగా 1881-82 లో కొత్త జిల్లా ఏర్పాటు అయ్యింది
  6.గుత్తి – మ్యాపులో బళ్లారి, కడప, కర్నూలు పేర్ల తర్వాత గుత్తి పేరు ప్రముఖంగా ఇచ్చారు. దానికి కారణం గుత్తికోట బ్రిటీషు వారికి అత్యంత ప్రముఖమైనది. తిరుగుబాటు చేసిన పాలేగాల్లను బంధించి గుత్తి జైలులోనే ఖైదు చేసేవారు. అలా పాలేగాళ్లను గుత్తిలో ఖైదు చేసిన మన్రోను అనారోగ్యంతో మరణించినపుడు అదే గుత్తిలో సమాధి చేయడం వైచిత్రి.
 5. చిత్తూరు-1840ల నాటికి చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది. 1855లో ఉత్తర ఆర్కాటు జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండేది. తర్వాత 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది
 6. బళ్లారి – 1800 నుండి 1953 వరకు దాదాపు 153 సంవత్సరాలు రాయలసీమలో భాగంగా ఉన్న బళ్లారి జిల్లా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో 3 మండలాలు మినహా (ఆదోని, రాయదుర్గం, ఆలూరు) మైసూరు రాష్ట్రంలో కలిసింది.
 7. ఆదోని – విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రముఖ కోటగా, వర్తక కేంద్రంగా ఉన్న ఆదోని 153 సంవత్సరాలు బళ్లారి జిల్లాలో ఉండి 1953లో కర్నూలు జిల్లాలో కలిసింది.
 8. కర్నూలు – 1840ల నాటికి కర్నూలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉంది. 1839లో చివరి కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ బహదూర్ ఖైదు చేయబడ్డాడు. కర్నూలు రాజ్యం బ్రిటీషు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్ళింది. తరువాత 1858లో కర్నూలు రాజ్యం, బళ్లారి నుండి పంచపాల్యం మొ. ప్రాంతాలు, కడప నుండి కంభం, గిద్దలూరు, మార్కాపురం, కోయిలకుంట్ల ప్రాంతాలు అన్నీ కలిపి రాయలసీమలో మూడవ జిల్లాగా కర్నూలు జిల్లా ఏర్పడింది.

మీకు తెలుసా ?

ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండే కనిగిరి ప్రాంతం (కనిగిరి పట్టణం తో సహా) ఒకప్పుడు కడప జిల్లాలో ఉండేదని. కనిగిరి తాలూకా 1850-60ల వరకు కడప జిల్లాలో ఉండి, తరువాత కర్నూలు జిల్లాకు బదిలీ చేయబడి, చివరకు నెల్లూరు జిల్లాలో కలపబడింది. 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు కనిగిరి నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలో కలపబడింది.

ఈ విధంగా నెల్లూరు జిల్లానుండి ప్రకాశం జిల్లాకు బదిలీ చేయబడిన భూబగంలో కూడా కొంత ముందు రాయలసీమలో ఉండేది.

కంభం, మార్కాపురం, దూపాడు ప్రాంతాలు మొదట కడప జిల్లా, తరువాత కర్నూలు జిల్లాలో ఉండి తరువాత ప్రకాశం జిల్లాలో భాగమయ్యాయి.

Source: Ravi Theja reddy

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s