Nawab ghulam rasool khan

స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాల్లో ఎందరో అశువులు బాసారు. ఎందరో అమర వీరుల త్యాగఫలం నేటి మన స్వాతంత్య్రం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల్లో నవాబులు కూడా కొందరున్నారు .ఉద్యమం కోసం జాగీర్ ను సైతం త్యాగం చేసి మరణించిన నవాబు లో కర్నూలు చివరి నవాబు ఒకరు.

మన దేశ చరిత్రలో మరుగునపడ్డ స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో? వారిలో ఒకరు… “జాన్ కుదేవో……. వతన్ కో బచావో” అన్న నినాదంతో బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా మొదలైన వహాబీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి. చివరికి జాగీర్ ను సైతం త్యాగం చేసి ఉద్యమం కోసమే జీవించిమరణించిన కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్.

అలూఫ్ ఖాన్ తన ఆరుగురు కొడుకుల్లో చివరవాడైన గులాంరసూల్‌ఖాన్ మీద ఉన్న ప్రేమ వల్ల తన బదులుగా అతడిని నవాబును చేసేందుకు అంగీకరించమని గవర్నర్ మింటోను ప్రార్థించారు. అతని కోరిక మేరకు అందుకు అనుగుణంగా యిచ్చిన ఫర్మానాతో చివరి కొడుకు గులాం రసూల్ ఖాన్ ను నవాబును చేశారు.

మళ్ళీ అతనికి మారుగా కొంతకాలం మునవర్‌ఖాన్, ఆపైన ముజఫర్‌ఖాన్ నవాబులు అయ్యారు. క్రీ.శ.1815లో అలూఫ్‌ఖాన్ మరణించడంతో కంపెనీ ప్రభుత్వాధికారులు ముజఫర్ ఖాన్‌ని తొలగించి మునవర్ ఖాన్‌నే నవాబు చేశారు. 1823 సంవత్సరంలో గులాం రసూల్‌ఖాన్ నవాబు అయ్యారు.

క్రీస్తు పూర్వం 1857 లో సిపాయిల తిరుగుబాటు పూర్వమే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్ లో నేటి కర్నూలు జిల్లాలో 1857కంటే మునుపే మూడు ముఖ్యమైన తిరుగుబాట్లు జరిగాయని 1801 లో పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాల్లో పడమర దిక్కున ఉన్న తెర్నేకల్ గ్రామస్తులు వీరోచితంగా పోరాడి అసువులు బాసారని చరిత్ర చెబుతోంది. 1823 లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన మహా బి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసారు. తిరుగుబాటు దారులకు ఆయుధాలు ఇవ్వాలని కర్నూలు పట్టణంలో ప్రాంతంలో రహస్యంగా ఆయుధాల కర్మాగారం నెలకొల్పారు. తుపాకులు కత్తులు బాకులు ఫిరంగులు మందుగుండు తయారు చేయించారు. ఈ విషయం బ్రిటీషు వారికి తెలిసింది.
బ్రిటిషు వ్యతిరేక ఉద్యమంలో కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌, ముబారిజుద్దౌలాతో చేతులు కలిపారు. ఈ విషయాన్ని పసికకట్టిన బ్రిటిష్‌ అధికారులు టి.యల్‌.బ్లేన్‌ అను సైనికాధికారిని విచారణ కోసం నియమించారు. ఆ విచారణ తరు వాత 1839 అక్టోబర్‌ 18న ఆంగ్ల సైన్యాధికారి ఎ.బి.డైస్‌ నాయకత్వంలో ఆంగ్ల సైన్యం కర్నూలు నవాబు సంస్థానం మీద దాడి చేసింది.

ఆ పోరాటంలో నవాబు గులాం రసూల్‌ ఆంగ్ల సైన్యాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ పరాజితులయ్యారు. ఆయనను అరెస్టు చేసి తిరుచునాపల్లి ఖైదుకు తరలించారు. రాజకీయఖైదీగా తిరుచునాపల్లి జైలులో ఉండగా ఆయన ఇస్లాం నుంచి క్రైస్తవానికి ఆకర్షితులయ్యారు. అతను క్రమంతప్పకుండా చర్చికి వెళ్తూ క్రైస్తవాభిమాని కావడం సహించలేని ఓ వ్యక్తి 1840 జూలై 12న పొడిచి చంపాడు. ఆ ఘాతుకానికి పాల్పడిన గులాం రసూల్‌ హంతకుడికి ఉరిశిక్ష పడింది. ఈ విధంగా గులాం రసూల్‌ పోరాట జీవితం ముగిసింది.

కర్నూలు నవాబుల్లో చివరి వాడైన గులాం రసూల్ ఖాన్ స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొన్నారు. అయితే వీరిపాలనపై విమర్శలు ఉన్నాయి. ప్రజాకంటకమైన పరిపాలన చేశారు.

యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అతని పరిపాలన గురించి తన కాశీయాత్రచరిత్రలో భాగంగా సవివరంగా వ్రాసుకున్నారు.
రసూల్ ఖాన్ కాలంలో తన పరిపాలనలో ఉన్న అహోబిలం, శ్రీశైలం వంటి హిందూ పుణ్యక్షేత్రాల నుంచి భారీగా డబ్బు రాబట్టుకుని కనీస సౌకర్యాల కల్పనలో కూడా శ్రద్ధ వహించేవారు కాదు.

శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. అహోబిలంలో ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు.

నవాబు ప్రజలను పీడించి రకరకాల పద్ధతుల్లో సొమ్ము రాబట్టుకునేవారు. పన్నుల వసూలులో క్రమపద్ధతి లోపించింది. నవాబులు నిర్దేశించిన పన్నులు గ్రామాధికారులు వసూలుచేసి యిచ్చే స్థితి నుంచి గ్రామాధికారులే తమకు తోచిన పన్నులు వేసి వసూలుచేయడం వరకూ వచ్చింది.

గ్రామాధికారులకు గ్రామాలను గుత్తకు యిచ్చి ఇంతకు తక్కువ వసూలుచేయరాదన్న నియమాలు విధించడంతో వారు ఇష్టారాజ్యంగా పన్నులు వేసి, పీడించడం జరిగిందన్న విమర్శలున్నాయి. ఎది ఏమైనా చరిత్రకారుల్లో ఒకరిగా మిగిలిపోయారు.

సేకరణ:– చందమూరి నరసింహా రెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s