తెలుగు సినిమా చరిత్రలో ప్రముఖ నటి రమాప్రభ గురించి ప్రస్తావిస్తే ఆమె కేరీర్ ప్రత్యేకమైన అధ్యాయంగా మారుతుంది. ఆమె నటించని పాత్ర లేదు. వేయని వేషం లేదు. ప్రతిభకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఎస్వీరంగారావు, సావిత్రి, వాణిశ్రీ, రాజబాబు, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ లాంటి ఎందరో దిగ్గజ నటీనటులతో నటించారు. తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి గొప్ప నటిగా పేరుతెచ్చుకొన్నారు. ప్రస్తుతం పరిశ్రమకు దూరమై మదనపల్లిలో శేష జీవితాన్ని గడుపుతున్నారు.
రమాప్రభ తెలుగు సినిమా నటి. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు సినిమాలలో నటించింది.
రమాప్రభ 1946, మే 5 న అనంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించింది. రమాప్రభ కొట్టి చిన్నమ్మ, గంగిశెట్టి దంపతులకు నాలుగో సంతానంగా పుట్టింది. ఆమె పుట్టే నాటికి ఆమె మేనత్త, మేనమామలకు పిల్లలు లేరు. రమాప్రభ నెలరోజుల పసికందుగా ఉన్నప్పుడు మాకిచ్చేయరాదా పెంచుకుంటాము అని మేనత్త మేనమామ అడగగా, తల్లిదండ్రులు దత్తత ఇచ్చేశారు. మేనమామ కృష్ణదాస్‌ ముఖర్జీ అబ్రకం గనుల్లో పని చేసేవాడు. రమాప్రభ బాల్యం కదిరిలో కొంతకాలం ఆ తర్వాత ఊటి సమీపంలోని లోయలో సాగింది. ఒక్కగానొక్క పెంపుడు కూతురు కాబట్టి తనను గారాభంగా పెంచారు. చిత్తూరు జిల్లా, వాల్మీకిపురానికి (దీని పాతపేరు వాయల్పాడు) చెందిన కృష్ణదాస్‌ ముఖర్జీ పెంపుడు తండ్రి. గూడూరులో మైకా వ్యాపారం చేశారు. కానీ రమాప్రభకు పన్నెండేళ్లు వచ్చేసరికి పెంపుడుతండ్రి చనిపోయాడు. వ్యవసాయ కూలీ అయిన సొంత తండ్రి పదమూడు మంది సంతానంతో వారిని సాకలేక సతమతమవుతూ, కూలీ పని లేనప్పుడు ఇంట్లో గాజుల మలారం పెట్టుకొని గాజులు అమ్మేవాడు. అలాంటి పరిస్థితుల్లో రమాప్రభ, పన్నెండేళ్ల వయసులో మేనత్త రాజమ్మతో కలిసి మద్రాసు చేరుకుంది. చదువు లేక, డబ్బు లేక, తినటానికి తిండి లేక వీధుల వెంట పనికోసం తిరిగారు. అనంతరం
హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది. ప్రముఖ నటుడు శరత్‌ బాబును పెళ్ళాడి 14 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది. సినిమాల్లోకి రాకముందు తమిళ నాటకరంగంలో నాలుగువేలకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు.


టాలీవుడ్‌లో కొన్ని బంధాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. అందులో శరత్ బాబు, రమాప్రభ గురించి కూడా చెప్పుకోవాలి. దాదాపు 50 ఏళ్ల కింద వీళ్ళ వివాహం జరిగింది. అప్పట్లో ఇద్దరూ కొన్నేళ్లు కలిసున్నారు. ఆ తర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయారు.


శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా.కాంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని చెప్పింది.
రమాప్రభ ఎప్పుడు అడిగినా కూడా శరత్ బాబు తనను మోసం చేశాడని.. ఆయన గురించి తాను మాట్లాడన‌ని చెబుతుంది. అయితే ఇప్పుడు ఈ విషయంపై శరత్ బాబు కూడా ఓపెన్ అయ్యాడు.
శరత్ బాబు అసలు పేరు. సత్యనారాయణ దీక్షిత్
1951 జూలై 31
ఆమదాలవలస, ఆంధ్రప్రదేశ్, లో జన్మించారు.
శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్‌, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.
అందరూ అనుకుంటున్నట్లు రమాప్రభను తానే మోసం చేయలేదని.. అసలు తమ మధ్య జరిగింది పెళ్ళి కాదు ఒక కలయిక మాత్రమే అంటున్నాడు. అప్పుడే చదువు పూర్తి చేసుకుని ఇండస్ట్రీకి వచ్చిన తాను.. తన కంటే వ‌య‌సులో ఐదారేళ్లు పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానని చెప్పాడు శరత్ బాబు. జీవితంలో తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల తర్వాత ఏం కోల్పోయానో అర్థమైందని చెప్తున్నాడు. జరిగిపోయిన గతం గురించి ఇప్పుడు ఆలోచించి లాభం లేదంటున్నాడు శరత్ బాబు.
అందరూ అనుకుంటున్నట్లు తాను రమాప్రభ ఆస్తులను ఏమీ రాయించుకోలేద‌ని.. అలాంటి ఆరోపణలు వచ్చినందుకు తానే తన ఆస్తులు అమ్మి రమాప్రభతో పాటు ఆమె సోదరుడు పేరుమీద రాసిచ్చాన‌ని చెప్పాడు శరత్ బాబు. వాటి విలువ ఇప్పుడు 50 నుంచి 60 కోట్లు ఉంటుందని షాకింగ్ న్యూస్ చెప్పాడు ఈయన.
అయితే నేడు రమాప్రభ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను, కష్టాలను ప్రేక్షకులతో పంచుకొన్నారు. రమాప్రభ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
నేను ఎంతో సంపద చూశాను. ఇప్పుడు నా వద్ద డబ్బు లేకపోవచ్చు. ఇప్పుడు రమాప్రభ ఒంటరి కావొచ్చు. నాకు ఎవరితో సంబంధాలు లేకపోవచ్చు. అందుకే ఏకాంతంగా ఉండాలని అనుకొన్నాను. ఆ కారణంగానే నేను హైదరాబాద్ నుంచి మదనపల్లికి వచ్చాను.
నా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని నాగార్జున బాబు, పూరీ జగన్నాథ్ నన్ను ఆదుకొన్నారు. ప్రతి నెల 5 తేదీ లోపు నా బ్యాంకు అకౌంట్‌లో పూరీ బాబు డబ్బులు వేస్తారు. ముందు నా అకౌంట్‌లో ఎవరు డబ్బు వేస్తారనే విషయం కూడా తెలీదు. బ్యాంక్ క్యాషియర్‌ను అడిగి తెలుసుకున్నాను.
నటి సావిత్రి గారి గురించి రమాప్రభ మాట్లాడుతూ ఇలా అన్నారు.
తప్పంతా సావిత్రమ్మదే, ప్రముఖ నటి సావిత్రికి అత్యంత సన్నిహితంగా మెలిగినవారిలో రమాప్రభ ఒకరు… ఎంతలా అంటే సావిత్రి వంటింట్లోకి, బెండ్రూంలోకి చొచ్చుకుపోయేంత! ఇటీవల సావిత్రి జీవితంపై ‘మహానటి’ సినిమా వచ్చిన నేపథ్యంలో ఓ ప్రముఖ వెబ్ ఛానల్ రమాప్రభను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆమె సావిత్రి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీంతో పాటు శరత్ బాబుతో తన వైవాహిక బంధం గురించి కూడా వెల్లడించారు.
ఈ జనరేషన్ దర్శకులు మీకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదనే ప్రశ్నకు రమాప్రభ స్పందిస్తూ… ఇప్పటి డైరెక్టర్లకు చాలా మందికి ఇగో ఉందని, వారికి మా లాంటి సీనియర్ ఆర్టిస్టులను గౌరవించడం తెలియదని, దాంతో పాటు వారు అనుకున్న సినిమా బిజినెస్‌కు నేను సరిపోననే భావన కూడా ఉండొచ్చు అన్నారు. అలాగే చాలా మంది మేనేజర్లు కంఫర్టు, ఫ్యాకేజీలు ఆశిస్తారు. నా నుండి అలాంటివి ఉండవు కాబట్టే దర్శకులు, నిర్మాతలకు నేను నటించాలని ఉన్నా… ఏదో ఒక కారణంతో వారికి కంఫర్టుగా ఉండే వారిని పెట్టుకునేలా ప్లాన్ చేసుకుంటారు అని రమాప్రభ తెలిపారు.
ఈ మధ్య కొందరు కళాసేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఎవడైనా అలా అంటే నాకు మండి పోతుంది. మనం ఎక్కడ కళాసేవ చేస్తున్నాం? డబ్బులు తీసుకుంటున్నాం. ఓసీలో ఏసీ అనుభవిస్తున్నాం. స్టైల్‌గా ఉంటున్నాం. ఇది సేవా? తప్పుకదా అలా అనడం. ఏ ఆసుపత్రికైనా వెళ్లి మా కళతో వారిని ఆనంద పరిచామా? ఏ పిచ్చి వారి దగ్గకైనా వెళ్లి నాలుగు జోకులు వేసి నవ్వించామా? డబ్బులు, పేరు దొబ్బడం కళా సేవా? అని రమా ప్రభ ప్రశ్నించారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమాప్రభ ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు వెల్లడించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన అల్లుడు అని, ఏడాది వయసులో ఉన్న తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని తాను దత్తత తీసుకున్నానని, ఆమెని రాజేంద్రప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేశానని రమాప్రభ వెల్లడించారు. అలాగే ‘మా అసోసియేషన్ వల్ల తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు. తాను చనిపోయినా… ఆ విషయాన్ని మా అసోసియేషన్ కి ఎవరు చెప్పవద్దని ఆమె ఇంటర్వ్యూ లో కోరుతూ అందరినీ కంటతడి పెట్టించారు. మా అసోసియేషన్ వారు తనని అవమానించడం తో పాటు ఏ రోజు కూడా సముచిత గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Source Google


జెమినీ గణేశన్-సావిత్రి రిలేషన్ దెబ్బ తినడంలో తప్పంతా సావిత్రమ్మదే. ఎంత ధర్మ గుణం ఉందో, ఎంత స్నేహ గుణం ఉందో… అంతే ధైర్యం, అంతే మొండి తనం ఉంది. తనకు దగ్గరగా ఉండి చాలా ప్రేమించే వారిని పో పో అని దూరం చేసుకుంది అని రమాప్రభ తెలిపారు.
సావిత్రమ్మ ఎంత మొండిదైనా జెమినీ ప్రేమించాడు. అంతలా ప్రేమించిన ఆయన్ను పనిమనుషులతో గెంటించింది, కుక్కలతో తరిమించింది. అయినా ఆమెపై జెమినీ ప్రేమను చంపుకోలేక గోడదూకి వచ్చి కిటికీలోంచి చూసేవాడు….. అని రమాప్రభ గుర్తు చేసుకున్నారు.
జెమినీ వల్లనే అమ్మకు లైఫ్. జెమినీ మామ ప్రేమించినంత ఎవరూ ప్రేమించ లేదు. ఆమెకు బాగా ఇగో, బాగా మొండి… అలా అని చెడ్డది కాదు. ఆ మొండి తనం వల్లే ఇదంతా జరిగింది. ఆమె చివరి రోజుల్లో బీదరికం అనుభవించింది అనేది నిజం కాదు…. అని రమాప్రభ తెలిపారు.
సావిత్రమ్మకు మందు తాగడం ఎవరూ నేర్పించలేదు. మొండితనంతో జెమినీని సాధించడానికి తాగేది. ఆమెకు ఎవరూ శత్రువులు లేరు. అందరికీ పెట్టే అలవాటు ఉందే తప్ప మరేమీ కాదు. ఓసారి కారు నడుపుకుంటూ వెళ్లి ఒకరిని గుద్దేసింది. కారును అక్కడే వదిలేసి వచ్చేసింది. ఆ కారు ఏమైందో? అలా ఉండేది సావిత్రి ప్రవర్తన అని…. రమాప్రభ గుర్తు చేసుకున్నారు.
జెమినీ గణేశన్ తాగుడు అలవాటు చేయించాడు అనేది చూపించడం చాలా దారుణం. సావిత్రి అంత మొండిగా, ఆరోగెంటుగా ఉన్న కూడా ప్రేమించిన ఒకే మనిషి జెమిని. చివరి వరకు ఆమెపై అదే ప్రేమ చూపించాడు. చివరి రోజుల్లో ఆసుపత్రిల్లో ఉన్నపుడు నేను ఇది స్వయంగా చూశాను అని రమాప్రభ గుర్తు చేసుకున్నారు.
సావిత్రి తాగేసి ఉంటే పని వాళ్లు చిన్న చిన్నవి కొట్టేయడం జరిగేది, కొందరు చెక్కుల మీద సంతకాలు తీసుకోవడం జరిగింది. ఆమె ఆస్తి పోవడానికి ప్రధాన కారణం సొంతగా సినిమాలు తీయడమే. వద్దని జెమినీ అంటూనే ఉన్నాడు. అందుకే ఆయన్ను తరిమించింది. ఒకసారి నా చేతనే తరిమించింది. అందరి ముందు ఆయన్ను వాడు అనేది, వాడిని తరిమేయ్ అనేది. అక్కా నువ్వు అట్లా చెప్పొద్దు అంటే నువ్వు మూస్తావా? లేదా? అని నన్ను చేతిలో పెస్తకం ఉంటే పుస్తకం, ప్లేటు ఉంటే ప్లేటుతో కొట్టేది…. అని రమాప్రభ గుర్తు చేసుకున్నారు.
చాలా మంది వద్ద సావిత్రి ఆస్తులు ఉన్నాయని, చివరి రోజుల్లో తిరిగి అడిగితే ఇవ్వలేదు అనేది అబద్దం. ఈవిడ అడగలేదు, అడగదు కూడా. ఆ మధ్య సావిత్రి నాకు సహాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. అది అసలు నిజం కాదు. ఆమె చివరి దశలో ఉన్నపుడే నా కెరీర్ ఫుల్‌పీక్ స్టేజీలో ఉంది…. అని రమాప్రభ తెలిపారు.
శరత్ బాబును పెళ్లి చేసుకుని 14 సంవత్సరాలు కలిసున్నాను. అపుడు మేము పిల్లల గురించి ఆలోచించలేదు. ఆయనకు పెద్ద ఫ్యామిలీ, నాదీ పెద్ద ఫ్యామిలీ. ఇద్దరం కెరీర్ పరంగా పైకొస్తున్నాం. పిల్లల కొతర లేదు అనే విధంగా మా ఫ్యామిలీ ఉండేది. మా ఆలోచన ఆ సైడ్ పోలేదు. మా వివాహ బంధం కమర్షియల్ అని చెప్పలేం, అలా అని పక్కా అని చెప్పలేం. ఉన్నామంతే. ఇంగ్లీష్ స్టైల్‌లో చెప్పాలంటే లివింగ్ టుగెదర్…. అని రమాప్రభ తెలిపారు.
పిల్లలు లేరనే బాధ నాకు ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. పిల్లలకు పెద్దల వాళ్ల మీద ప్రేమ ఆస్తుల విషయంలోనే తప్ప మరే విషయంలోనూ ఉండదు. ఇక పురుషులు నలుగురిలో నేను మగాడిని అనిపించుకోవడానికే బిడ్డను కనాలే తప్ప లేక పోతే అది ఇపార్టెంట్ కాదు. అసలు పిల్లలను ఎందుకు కనాలి? వారుసులు లేకపోతే ఎలా అనడానికి మీదేమైనా రాజవంశమా? వెయ్యి ఎకరాలు ఆస్తి ఉందా?… అంటూ తనదైన రీతిలో స్పందించారు రమాప్రభ
విడిపోయిన తర్వాత శరత బాబు నాకు చాలా సార్లు ఎదురయ్యాడు. నేను మామూలుగానే ఉంటా. ఆయనే ఇలా మూతి పెట్టుకుని మాట్లాడకుండా ఉంటాడు. అతడు అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతడి ఆస్తి నేనేమీ తినలేదు.
. మేం విడిపోయిన పది రోజులకే మధుసూదనరావు దర్శకత్వంలో కలిసి నటించాం .. కాకపోతే మేం విడిపోయిన సంగతి అప్పటికి ఆ దర్శకుడికి తెలియదు. అప్పటి జీవితాన్ని నేను ఒక సినిమాగా కూడా అనుకోను .. కాస్త ఎక్కువసేపు సాగిన సీన్ అనుకుంటాను అంతే” అంటూ చెప్పుకొచ్చారు.
శరత్ బాబు ఒక వేళ రియలైజ్ అయి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అనే ప్రశ్నకు రమాప్రభ స్పందిస్తూ….వంద శాతం సంతోషంగా రిసీవ్ చేసుకుంటాను. అదొక రిలేషన్ అనుకుంటా. నాకు ఇగో లేదు. ఎటాచ్మెంటు లేదు డిటాచ్మెంటు లేదు. అందరిలాగే ఆయన్ను ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తాను అని రమాప్రభ తెలిపారు.
ప్రస్తుతం మదనపల్లె పట్టణంలో తన శేష జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.

సేకరణ:–చందమూరి నరసింహా రెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s